»   »  సీక్రెట్ గా...‌: ప్రధానితో ఆమిర్‌ఖాన్‌ డిన్నర్‌!

సీక్రెట్ గా...‌: ప్రధానితో ఆమిర్‌ఖాన్‌ డిన్నర్‌!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై‌: క్రితం సంవత్సరం అసహనంపై ప్రముఖ బాలీవుడ్ హీరో ఆమిర్‌ ఖాన్ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన మన దేశ ప్రధాని మోదీతో కలిసి శనివారం రాత్రి డిన్నర్‌ చేశారు. ఈ డిన్నర్‌లో నటి కంగనా రనౌత్‌ కూడా పాల్గొన్నట్టు సమాచారం.

Aamir Khan has dinner with Modi after Make in India event

ఈ డిన్నర్ లో ..రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాలకు చెందిన రాయబారులు హాజరయ్యారు. ముంబయిలో మేకిన్‌ ఇండియాపై కార్యక్రమం జరిగిన అనంతరం ఈ డిన్నర్‌ను ఏర్పాటుచేశారు. అత్యంత రహస్యంగా గా జరిగిన ఈ కార్యక్రమానికి మీడియాను అనుమతించలేదు.

అమీర్ అసహనంపై చేసిన వ్యాఖ్యలను అప్పుడు భాజపా తప్పుపట్టింది. ఇన్ క్రెడిబుల్ ఇండియాకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న ఆమీర్‌ఖాన్‌.. అసహనంపై వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. తరువాత జరిగిన పరిణామాలతో ఆమీర్‌ను ఇన్ క్రెడిబుల్ ఇండియాకు అంబాసిడర్‌ నుంచికేంద్రపర్యాటకశాఖ తొలగించిన విషయం తెలిసిందే.

English summary
Bollywood superstar Aamir Khan, who was at the centre of a controversy over his comments on intolerance, attended a dinner hosted by Prime Minister Narendra Modi here on Saturday night.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu