»   » ఆ హీరో ఒక్క యాడ్ రెమ్యునేషన్ 35 కోట్లు

ఆ హీరో ఒక్క యాడ్ రెమ్యునేషన్ 35 కోట్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

అవును..కేవలం బుల్లి తెరపై కొద్ది సెకన్లు పాటు కనిపించే యాడ్ కోసం అమీర్ ఖాన్ కు 35 కోట్లు చెల్లించేందుకు ఓ ఇంటర్నేషనల్ కంపెనీ ముందుకొచ్చింది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు చెందిన ఓ టెలికాం సంస్థ అమీర్‌ఖాన్‌ని మన దేశంలో తమ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకొంది. ఈ సంస్థ త్వరలో తమ వ్యాపార కార్యకలాపాల్ని మన దేశంలో ప్రారంభించబోతోంది. ఆ మేరకు ఆయనతో సంప్రదింపులు జరిపింది.అలాగే అమీర్ ఖాన్ కి పారితోషికంగా రూ.35 కోట్లు చెల్లించేందుకు అంగీకరించినట్లు సమాచారం. ఈ సంస్థకు ఆయన మూడేళ్లపాటు అంబాసిడర్ గా వహరిస్తారు. అలాగే ఇంకా చాలా కంపెనీలు తమ వాణిజ్య ప్రకటనల్లో నటించమంటూ అమీర్‌ని కోరుతున్నాయి.ప్రస్తుతానికి మూడు కంపెనీలకు ఆయన కమిట్ అయినట్లు తెలుస్తోంది. ఇక అమీర్ ఖాన్ నటించిన 'త్రీ ఇడియట్స్‌' టాక్ తో దూసుకుపోతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu