»   » కత్రినా సెక్సీగా ఉన్నా...అందులో దమ్ము లేదు(వీడియో)

కత్రినా సెక్సీగా ఉన్నా...అందులో దమ్ము లేదు(వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: 'ధూమ్-3' టైటిల్ సాంగ్ 'ధూమ్ మచాలే ధూమ్' ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అనే ఎదురు చూపులకు తెర పడింది. ఎట్టకేలకు వీడియో సాంగ్ రిలీజైంది. కత్రినా కైఫ్, అమీర్ ఖాన్ హై ఎనర్జీ డాన్స్‌తో కూడిన ఈ సాంగ్ సినిమా ప్రమోషన్లో భాగంగా విడుదల చేయడంతో పాటు, క్రికెటర్ సచిన్‌కు ఈ సాంగును అంకితం ఇచ్చారు.

ఈ సాంగులో కత్రినా కైఫ్ మరింత అందంగా, హాట్ అండ్ సెక్సీ లుక్‌తో దర్శనమిచ్చింది. ధూమ్ 3 అనగానే భారీ అంచనాలు ముందు నుంచి ఉన్నాయి. అయితే పాట బానీలతో పాటు, కొరియోగ్రఫీ అంచనాలను అందుకునే విధంగా లేదనే టాక్ బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది.

Katrina Kaif

కత్రినా ఈ సాంగు కోసం డాన్స్ ప్రాక్టీస్ చేసేందుకు చాలా కష్టపడింది. ఆరు వారాల పాటు ప్రాక్టీస్ చేసిందట. ప్రముఖ కొరియోగ్రాఫర్ వైభవి మెర్చంట్ కంపోజ్ చేసారు. ఓ స్టూడియోను ఆరు వారాల పాటు బుక్ చేసుకుని ప్రతి రోజూ 4 నుంచి 6 గంటల పాటు ప్రాక్టీస్ చేసారని తెలుస్తోంది.

ధూమ్ మచాలే ధూమ్...వీడియో సాంగ్ కోసం క్లిక్ చేయండి

అమీర్ ఖాన్ ఈచిత్రంలో విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. కత్రినా కైఫ్ తన హాట్ అండ్ సెక్సీ అందాలతో పాటు....సాహస విన్యాసాలతో ప్రేక్షకులను ఆకట్టుకోబోతోంది. ఈ చిత్రంలో ఆమె అలియా పాత్రలో నటిస్తోంది. ధూమ్, ధూమ్-2 చిత్రాలు భారీ విజయం సాధించి నేపథ్యంలో దానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈచిత్రంపై మొదటి నుండీ భారీ అంచనాలే ఉన్నాయి. పైగా అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరో ఈచిత్రంలో నటిస్తుండటం కూడా మరో కారణం. . ఈచిత్రం క్రిస్‌మస్ సీజన్‌‍ను పురస్కరించుకుని డిసెంబర్ 20న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

భారీ యాక్షన్ సన్నివేశాలు, కళ్లు చెదిరే సాహసాలు ఈచిత్రంలో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనున్నాయి. ధూమ్ చిత్రం మొదటి భాగంలో జాన్ అబ్రహం నటించగా....దానికి సీక్వెల్ గా వచ్చి ధూమ్-2 చిత్రంలో హృతి రోషన్ ప్రేక్షకులను మెప్పించాడు. ఇప్పుడు అమీర్ ఖాన్ 'ధూమ్-3' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చికాగో నేపథ్యంలో సినిమా స్టోరీ ఉంటుంది. అమీర్ ఖాన్ ఇందులో ఓ నేరస్తుడి పాత్రలో కనిపిస్తాడు. పోలీసులు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈచిత్రానికి విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తున్నారు.

English summary

 The Dhoom 3 title song 'Dhoom Machale Dhoom' has been long awaited, and now that it has finally released, it doesn't seem all that great! The song was released at the first song launch of Dhoom 3.The song features Katrina and Aamir do a very high energy dance. The song was unveiled at a promotional event of Dhoom 3 song launch where Aamir dedicated the 'Dhoom Machale' song to Sachin.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X