»   » నా డ్రీమ్ ప్రాజెక్ట్ 20 ఏళ్ల టైమ్ తినేస్తుందేమో?: అమీర్ ఖాన్... చిరు, రజనీ, పవన్‌తో చేయాలని!

నా డ్రీమ్ ప్రాజెక్ట్ 20 ఏళ్ల టైమ్ తినేస్తుందేమో?: అమీర్ ఖాన్... చిరు, రజనీ, పవన్‌తో చేయాలని!

Posted By:
Subscribe to Filmibeat Telugu

'బాహుబలి' దర్శకుడు రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్టు 'మహాభారతం' అని చెప్పినపుడే.... బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ కూడా తన డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా మహాభారతం అని, కృష్ణుడు లేదా కర్ణుడి పాత్ర చేయాలని ఉందని వెల్లడించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం తన తాజా సినిమా 'సీక్రెట్ సూపర్ స్టార్' ప్రమోషన్లలో బిజీగా ఉన్న అమీర్ ఖాన్ వడోదర వెళ్లారు. ఇక్కడ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన 'సీక్రెట్ సూపర్ స్టార్' విశేషాలతో పాటు తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి ప్రశ్నలు ఎదురవ్వగా ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

మొదలు పెట్టాలంటే భయంగా ఉంది

మొదలు పెట్టాలంటే భయంగా ఉంది

‘మహాభారతం' సినిమా చేయడమే నా డ్రీమ్ ప్రాజెక్ట్. అయితే ఆ సినిమా మొదలు పెట్టాలంటనే భయంగా ఉంది. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ తన జీవితంలో కనీసం 15 నుండి 20 సంవత్సరాల సమయం తినేస్తుంది.... అని తెలిపారు.

ఫేవరెట్ క్యారెక్టర్

ఫేవరెట్ క్యారెక్టర్

మహాభారతంలో నా ఫేవరెట్ క్యారెక్టర్ కర్ణుడు. అయితే నా ఫిజిక్ ప్రకారం దానికి నేను సరిపోను అనుకుంటున్నాను. నాకు సరిపోయే విధంగా ఉండే పాత్ర కృష్ణుడి పాత్ర...అని అమీర్ ఖాన్ తెలిపారు.

అర్జునుడి పాత్ర గురించి

అర్జునుడి పాత్ర గురించి

అదే విధంగా అర్జునుడి క్యారెక్టర్ కూడా చాలా ఇష్టం. సొంత వాళ్ల‌ను చంపాల్సిన అవ‌స‌రమేంట‌ని కృష్ణుడిని ప్ర‌శ్నించింది కేవ‌లం అర్జునుడే..... అని అమీర్ ఖాన్ వెల్లడించారు.

రజనీ, చిరు, పవన్ కళ్యాణ్‌లతో

రజనీ, చిరు, పవన్ కళ్యాణ్‌లతో

అదే విధంగా సౌత్ ఇండియన్ సూపర్ స్టార్స్ రజనీకాంత్, చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లతో కలిసి సినిమాలు చేయాలని ఉందని అమీర్ ఖాన్ ఈ సందర్భంగా వెల్లడించారు.

సీక్రెట్ సూపర్ స్టార్

సీక్రెట్ సూపర్ స్టార్

అమీర్ ఖాన్ నటించిన సీక్రెట్ సూపర్ స్టార్ సినిమా విషయానికొస్తే... ఈచిత్రం దీపావళి సందర్భంగా అక్టోబర్లో విడుదలవుతోంది. ఇందులో అమీర్ మ్యూజిక్ డైరెక్టర్ పాత్రలో నటిస్తున్నాడు. సీక్రెట్ సూపర్ స్టార్ పాత్రలో దంగల్ ఫేం జైరా వాసిమ్ నటిస్తోంది. ఈ చిత్రాన్ని అమీ ఖాన్ తన సొంత బేనర్లో నిర్మిస్తున్నారు.

సినిమా కాన్సెప్ట్

సింగర్ కావాలని తపన పడే 14 ఏళ్ల బాలిక కథ నేపథ్యంలో ‘సీక్రెట్ సూపర్ స్టార్' సినిమా తెరకెక్కించారు. అద్వైత్ చంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అమిత్ త్రివేది సంగీతం అందించారు.

English summary
Recently while promoting his upcoming release Secret Superstar in Vadodara, Aamir in a conversation with Filmfare said, “My dream project is to make the Mahabharata but I’m afraid of starting the project as I know it will consume at least 15-20 years of my life.” Also, the actor mentioned his love for the character of Karna and Arjun. He said, “My favourite character is Karna, but I don’t know if I’ll be able to play him due to my physique. I may just have to play Krishna.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu