»   » బయటకి వస్తున్న సీక్రెట్ సూపర్‌స్టార్: ఈ రోజు సాయంత్రం ట్రైలర్ విడుదల చేయనున్న అమీర్ ఖాన్

బయటకి వస్తున్న సీక్రెట్ సూపర్‌స్టార్: ఈ రోజు సాయంత్రం ట్రైలర్ విడుదల చేయనున్న అమీర్ ఖాన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

విల‌క్ష‌ణ న‌టుడు ఆమిర్ ఖాన్ త‌న సొంత బ్యాన‌ర్‌లో నిర్మిస్తున్న సీక్రెట్ సూప‌ర్‌స్టార్‌ సినిమా పోస్ట‌ర్‌ను త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా విడుద‌ల చేశాడు. దంగల్‌, పీకే వంటి బ్లాక్‌బస్టర్లతో పాటు అప్పుడప్పుడు తారేజమీన్‌పర్‌ వంటి చిన్న చిత్రాలతోనూ తలుక్కున మెరిసే ఆమిర్‌ మరోసారి అలాంటి ప్రయత్నమే చేస్తున్నాడు.

ఈరోజు సాయంత్రం

ఈరోజు సాయంత్రం

ఈరోజు సాయంత్రం 6:30 గం.ల‌కు సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఆమిర్ ట్వీట్‌లో పేర్కొన్నాడు. జూలై 31న ఆయ‌న ఈ సినిమాకు సంబంధించి మొద‌టి పోస్ట‌ర్ విడుద‌ల చేశాడు. ఈ సినిమాకు సంబ‌ధించిన రెండో పోస్ట‌ర్‌ను త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ లో షేర్ చేశాడు అమీర్‌.


తారే జ‌మీన్ ప‌ర్‌

తారే జ‌మీన్ ప‌ర్‌

ఈ రెండో పోస్ట‌ర్ ద్వారా ఆ సినిమా సీక్రెట్ ను విప్పేశాడు.ఆ పోస్ట‌ర్ చూసి `తారే జ‌మీన్ ప‌ర్‌` లాంటి సినిమా రాబోతుంద‌ని అభిమానులు ఆశించారు. ఈ రెండో పోస్ట‌ర్‌లో `దంగ‌ల్‌`లో ఆమిర్‌తో పాటు న‌టించిన జైరా వ‌సీం పాఠ‌శాల దుస్తుల్లో గిటార్ వాయిస్తున్న‌ట్లు ఉంది. వెన‌కాల ఆమిర్ రాక్‌స్టార్ అవ‌తారంలో క‌నిపిస్తున్నాడు.


ఆమిర్‌ఖాన్‌, జైరా వాసిం

ఆమిర్‌ఖాన్‌, జైరా వాసిం

అద్వైత్‌ చందన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆమిర్‌ఖాన్‌, జైరా వాసిం, మేహర్‌ విజ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గాయనిగా తనేంటో లోకానికి చాటి చెప్పాలని కలలు కనే ఓ చిన్నారి కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. తండ్రి ప్రతిరోజు తాగి వచ్చి తల్లితో పాటు తనని చిత్రహింసలు పెడుతుంటే ఆ చిన్నారి తన తల్లిని తాగుబోతు తండ్రి నుంచి కాపాడుకొని తన ఆశయం ఎలా నెరవేర్చుకుంటుందనే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది.


ఆగస్టు 2న అంటే ఈరోజు సాయంత్రం

దీపావళికి తెరపైకి కానున్న ఈ చిత్ర ట్రైలర్‌ ఆగస్టు 2న అంటే ఈరోజు సాయంత్రం విడుదల కానుంది. `తారే జ‌మీన్ ప‌ర్` సినిమాతో చిన్న‌పిల్ల‌ల‌తో ఆమిర్ న‌ట‌న ఎంత బాగుంటుందో తెలిసింది. ఈ సినిమాతో కూడా అలాంటి మేజిక్ చేస్తాడ‌ని అభిమానులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.English summary
Hey guys, the Secret Superstar trailer will be out at 6.30/45 pm today. Here is the poster of the film," Aamir Khan tweeted
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu