»   » అది మన చేతుల్లో ఉండదు.. ఆమిర్ ఖాన్ అసలు సిసలు సీక్రెట్ ఇదే..

అది మన చేతుల్లో ఉండదు.. ఆమిర్ ఖాన్ అసలు సిసలు సీక్రెట్ ఇదే..

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ ఆమిర్ ఖాన్.. హీరోగా సినిమా చేసినా.. నిర్మాతగా సినిమా తీసినా.. ఏం చేసినా.. విజయాలు సాధిస్తూనే ఉన్నాడు. పక్కా ప్లానింగ్.. పర్ ఫెక్ట్ మేకింగ్.. అందుబాటులో ఉండేలా బడ్జెట్ ప్లానింగ్.. ఇదే ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్ విజయాలకు కారణమవుతోంది. మొదటి నుంచి.. నిర్మాతగా ఆమిర్ చేసిన సినిమాలను ఓ సారి గమనిస్తే.. లగాన్, జానే తూ యా జానే నా, ఢిల్లీ బెల్లీ, తాజాగా దంగల్.. ఇలా ఏ సినిమా చూసినా.. దేనికదే ప్రత్యేకత.. దేనికదే విభిన్నం. అందుకే.. హీరోగా రాణిస్తూనే.. తనకే సాధ్యమైన అభిరుచితో నిర్మాతగా కూడా ఆమిర్ ఖాన్ ఎవరికీ అందనంత ఎత్తులో నిలుస్తున్నాడు..

  దీపావళీ కానుకగా సీక్రెట్ సూపర్ స్టార్

  దీపావళీ కానుకగా సీక్రెట్ సూపర్ స్టార్

  అలాంటి.. విజయవంతమైన ప్రొడక్షన్ హౌజ్ నుంచి వస్తున్న మరో సినిమా.. సీక్రెట్ సూపర్ స్టార్. దీపావళీ కానుకగా విడుదల కానున్న ఈ ప్రాజెక్ట్ లో.. జైరా వసీమ్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. దర్శకుడిగా అద్వైత్ చందన్.. తన ప్రతిభ చూపించుకోబోతున్నారు. నిర్మాతలుగా.. ఆమిర్ ఖాన్ తో పాటు.. ఆయన భార్య కిరణ్ రావ్.. సినిమా షూటింగ్ ను పర్ఫెక్ట్ ప్లానింగ్ తో.. పూర్తి కానిచ్చేస్తున్నారు. విజయంపై.. పూర్తి నమ్మకంతో ఉన్నారు.

  సక్సెస్ వెనుక సీక్రెట్..

  సక్సెస్ వెనుక సీక్రెట్..

  ఈ మూవీ విషయంపై.. ఆమిర్ ఖాన్ ను మీడియా పలకరించగా.. చాలా విషయాలు పంచుకున్నారు. సినిమా మేకింగ్ లో ఇంత విజయవంతమవుతున్నారు కదా.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని.. సక్సెస్ అవుతున్నారు అని ఓ ప్రశ్న అడగ్గానే.. ఓపిగ్గా సమాధానం చెప్పి.. తన విజయ రహస్యాన్ని ఆమిర్ ఖాన్ బయటపెట్టాడు.

  జాగ్రత్తగా.. బ్యాలెన్స్‌డ్‌గా..

  జాగ్రత్తగా.. బ్యాలెన్స్‌డ్‌గా..

  బిజినెస్ చేస్తున్నపుడు.. ఖర్చు అనేది మన చేతుల్లో ఉండదు అని ఆమిర్ తేల్చి చెప్పేశాడు. కానీ.. జాగ్రత్తగా.. బ్యాలెన్స్‌డ్‌గా.. డబ్బులు ఖర్చు పెట్టడం.. నష్టం రాకుండా చూసుకోవడంలోనే.. అసలు విషయం ఉందని చెప్పాడు.

  పర్‌ఫెక్ట్ ప్రొడ్యూసర్ కూడా

  పర్‌ఫెక్ట్ ప్రొడ్యూసర్ కూడా

  అలాంటి జాగ్రత్తలకు తోడు.. సబ్జెక్ట్ పై నమ్మకం ఉంటే.. సినిమా బాగా వచ్చి తీరుతుందని అన్నాడు.. ఆమిర్ ఖాన్. దీంతో.. నిర్మాతగా ఆమిర్ విజయ రహస్యం ఇదా అని బాలీవుడ్ లో అంతా ఆశ్చర్యపోతున్నారు. ఆమిర్ మిస్టర్ పర్ ఫెక్ట్ మాత్రమే కాదు.. పర్‌ఫెక్ట్ ప్రొడ్యూసర్ కూడా అని ఒప్పేసుకుంటున్నారు. సీక్రెట్ సూపర్ స్టార్.. ఎలాంటి సెన్సేషన్ సృష్టించబోతోందా.. అని ఎదురు చూస్తున్నారు.

  English summary
  Aamir Khan productions is known to be one of the Bollywood's most renowned production banners with 100 % success rate in 16 years of its operation. The power packed content helmed by Aamir Khan Productions has a tremendous positive impression at the box office. Lagaan, Jaane Tu, Ya Jaane Na, Delhi Belly, and the most recent Dangal, AKP has been catering to various audience segments by delivering films that hold relevance.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more