»   » ఇన్స్పైరబుల్....! అమీర్ ఖాన్ మరో అద్బుతం చేయబోతున్నట్టే దంగల్ ట్రైలర్ ఇదే

ఇన్స్పైరబుల్....! అమీర్ ఖాన్ మరో అద్బుతం చేయబోతున్నట్టే దంగల్ ట్రైలర్ ఇదే

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ అమీర్‌ఖాన్.. లెజండ‌రీ రెజ్ల‌ర్ మ‌హావీర్ పోగ‌ట్ జీవిత నేపథ్యంలో దంగల్ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. రెజ్లింగ్ నేప‌థ్యంలో త‌న ఇద్ద‌రు కూతుళ్ల క‌ల‌లు సాకారం చేయ‌డానికి పోరాడే తండ్రి పాత్రలో అమీర్ నటించాడు. పీకే లాంటి ప్రయోగాత్మక చిత్రంతో మెప్పించిన అమీర్ ఖాన్ ఇప్పుడు దంగల్ తో మరోసారి అభిమానులు అలరించేందుకు రెడీ అయ్యాడు. ఈ చిత్రం కోసం అమీర్ బాగానే కసరత్తులు చేశాడు. అమీర్‌ ఖాన్‌ ప్రధానపాత్రధారుడిగా ఇండియన్‌ రెజ్లర్‌ మహ్‌వీర్‌ సింగ్‌ జీవిత కథగా తెరకెక్కిన 'దంగల్‌' మూవీ ట్రైలర్‌ రిలీజైంది.

మహవీర్ సింగ్ ఫోఘట్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన దంగల్ ట్రైలర్ కు మంచి రెస్పాన్సే వస్తోంది.ఈ ట్రైలర్ లో ఎమోషన్,హ్యూమర్ లాంటి అన్ని ఎలిమెంట్లు క్యారీ చేశారు.ఇక అమీర్ దంగల్ మూవీలో హర్యానా భాష కోసం క్లాసులకెళ్లి మరీ నేర్చుకున్నాడు.అమీర్ ఖాన్ డ్యూయల్ రోల్ లో కనిపించే దంగల్ మూవీ డిసెంబర్ లో స్క్రీన్ మీదకు రానుంది. ట్రైలర్ లోనే అమీర్‌ ఖాన్‌ తనదైన నటనతో మరోసారి ఆకట్టుకున్నాడు. ప్రీతమ్‌ చక్రవర్తి అందించిన బ్యాక్‌ గ్రౌండ్‌ ట్రైలర్‌కు మరో అస్సెట్‌గా నిలిచింది.

Aamir Khan's Dangal Trailer is the Only Thing You Need to See Today

"మిగతా అథ్లెట్ల లాగే నాకూ ఓ కల ఉండేది. నా దేశానికి బంగారు పతకం తెచ్చిపెట్టాలని. కాబట్టి నేను సాధించలేనిది నా కుమారుడి ద్వారా సాధించుకోవాలనుకున్నాను. కానీ నలుగురూ కూతుళ్లే పుట్టారు. పతకం సాధించడానికి అమ్మాయి ఐతేనేం అబ్బాయి ఐతేనేం. కానీ వెండి పతకం సాధిస్తే ఆ క్షణాన మాత్రమే ప్రజలు గుర్తుంచుకుంటారు. అదే బంగారు పతకం తెస్తే ఓ ఉదాహరణగా, రోల్‌మోడల్‌గా నిలుస్తారు.." అని ఆమిర్‌ చెప్పిన డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది.

ప్రముఖ రెజ్లర్ మహావీర్ పొగట్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో ఆమిర్ ఖాన్ టైటిల్ రోల్ పోషించాడు. తన ఆశయాన్ని కూతుళ్ల ద్వారా సాధించాలనుకునే తండ్రి పాత్రలో అతడు ఒదిగిపోయాడు. యువ మహావీర్ గా కూడా అతడు కనిపించనున్నాడు. అతడు పడిన కష్టం అంతా దంగల్ ట్రైలర్ గా స్పష్టంగా కనపడింది. నితీశ్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 23న విడుదలకానుంది..

ఈ సినిమాను నితేష్‌ తివారి దర్శకత్వం వహించగా అమీర్ కుమార్తెలు, రెజ్లర్లు గీతా పొగట్‌, బబితా కుమారి పాత్రలలో ఫాతిమా సనా, సన్యా మల్హోత్రా నటించారు. అమీర్‌ ఖాన్‌ ప్రొడక్షన్‌, డిస్నీ వరల్డ్‌ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ క్రిస్మస్‌ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

English summary
Aamir Khan manages to surprise us once again with his acting acumen and complete transformation as Mahavir Singh Phogat. But the film really belongs to actors playing his daughters.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu