twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఔను..! అమీర్ ఖాన్ నిజమైన ఇండియన్... "అప్పుడు తిట్టినోళ్ళు సిగ్గుపడేలా....

    |

    అమీర్ ఖాన్...! "అసహనం" మీద ఒక మాట అనగానే దేశం మొత్తం అతన్ని తిట్టిపోసింది. అప్పటివరకూ అమీర్ మీద ఉన్న ఇంప్రెషన్ ఒక్క నిజం మాట్లాడి నందుకు పాకిస్థాన్ కి వెళ్ళిపొమ్మన్నవాళ్ళూ ఉన్నారు. అన్న వాళ్లలో సగానికంటే ఎక్కువ మందికి కనీసం దేశభక్తీ అంటే సంవత్సరానికి రెండురోజులు ఝండావందనం చేయటం... క్రికెట్ లో దేశ భక్తి చాటుకోవటం తప్ప ఏమీ చేయని వారే...

    సత్యమేవజయతే కోసం అమీర్ కొన్ని కోట్ల ఆఫర్లను వదులుకున్నాడు... నష్టాలు వస్తాయని తెలిసీ మంగళ్ పాడే లాంటి సినిమాలు తీయటానికి ఒప్పుకున్నాడు.... లగాన్, రంగ్ దే బసంతీ, లాంటి సినిమాలలో దేశం మీద ఉండే ప్రేమని చాటుకున్నాడు... కానీ ఈ దురదృష్టవంతుడే "పీకే" అనే ఒక్క సినిమాతో "దేశ ద్రోహి" అయ్యాడు... దేశాన్ని ఏదో అన్నాడని కాదు దేవుడు లేడన్నాడనీ..., ఇండియా పాకిస్థాన్ లమధ్య శాంతి ని కోరుకున్నాడనీ....

    అయినా అమీర్ పట్టించుకోకోలేదు..., ఎందునటే అమీర్ "హీరో" పొలిటీషియన్ కాదు.., అమీర్ నిజమైన దేశభక్తుడు... ఫేస్బుక్ లో పోస్టుల్లో దెశాన్ని గౌరవించడు చేతల్లోనే చూపిస్తాడు.. తను చేసే పనులతో గాట్టి జవాబే చెబుతున్నాడు. వాటిని పబ్లిసైజ్ చేసుకోవట్లేదు. ఇంతకీ అమీర్ ఏం చేస్తున్నాడు అంటే... ఒక ప్రభుత్వం చేయాల్సిన పనిని తానొక్కడే చేస్తున్నాడు.... 100మంది ఉధ్యోగులని నియమించి మరీ "లాభల్లేని" దేశ సేవ చేస్తున్నాడు.... ఒక్కసారి ఇది చూడండి...

    పానీ ఫౌండేషన్:

    పానీ ఫౌండేషన్:

    మహారాష్ట్ర లో దేశం లో ఎక్కడా లేనంత నీళ్ళ కొరత ఉంది. కరువు అక్కడ విలయ తాండవం చేస్తోంది. ఎండాకాలం వస్స్తే పంటల సంగతి దేవుడెరుగు కనీసం తాగడానికి కూడా మంచినీళ్ళు ఉండవు ఆమిర్ ఖాన్ తన సొంత ఫౌండేషన్ ద్వారా ఇక్కడ పరిస్థితి మార్చడం కోసం "పానీ ఫౌండేషన్" ని స్థాపించి ప్రయత్నాలు చేస్తున్నాడు.

    దేవేంద్ర ఫద్నీస్ సర్కార్ కూడా:

    దేవేంద్ర ఫద్నీస్ సర్కార్ కూడా:

    ఇలాంటి మంచి చేస్తున్నప్పుడు అక్కడి ప్రభుత్వం కూడా వారికి సహకారం ఇచ్చి తీరాల్సిందే కదా! అందుకే దేవేంద్ర ఫద్నీస్ సర్కార్ కూడా అమీర్ కు సపోర్టు చేస్తోంది. ఆమిర్ ఇప్పుడు తన ఫౌండేషన్ ద్వారా కొత్త పోటీ మొదలు పెట్టాడు.

    ప్రతీ గ్రామం నుంచీ:

    ప్రతీ గ్రామం నుంచీ:

    వాన నీటిని కాకుండా రోజూ వాడే నీటిని మళ్ళీ ఉపయోగపడే విధంగా కొన్ని పద్దతులని నేర్పించే ప్రోగ్రాం ఇది. ప్రతీ గ్రామం నుంచీ ఐదుగురికి నీళ్ళని ఎలా స్టోర్ చెయ్యాలి అనేది ఆమిర్ ఫౌండేషన్ లో స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చారు.

    50 లక్షల బహుమతి:

    50 లక్షల బహుమతి:

    వీళ్ళలో ఏ గ్రామం వారు ఆ పద్దతులు అన్నీ ఫాలో అయ్యి ఎక్కువ నీరు స్టోర్ చేసుకుంటారో వారికి 50 లక్షల బహుమతి ప్రకటించాడు. ఈ యాభై లక్షల కోసం ప్రతీ గ్రామం పోటీ పడి మరీ నీళ్ళని నిల్వచేస్తాయి.

    వచ్చే ఐదేళ్ళ లో:

    వచ్చే ఐదేళ్ళ లో:

    ఈ విధానం తో వచ్చే ఐదేళ్ళ లో కరువు లేని ప్రాంతంగా మహారాష్ట్ర మారుతుంది అంటున్నారు విశ్లేషకులు.

    100 మంది ఎంప్లాయీస్:

    100 మంది ఎంప్లాయీస్:

    ఈ ఫౌండేషన్ కోసం స్వయంగా తన సొమ్ముతో ఏకంగా 100 మంది ఎంప్లాయీస్ ని పెట్టుకుని మరీ గట్టిగా నిర్వహిస్తున్నాడు అంటే అతని డెడికేషన్ ని మెచ్చుకుని తీరాల్సిందే.

    అనవసరంగా:

    అనవసరంగా:

    ఎంతటి ధృడ సంకల్పంతో పనిచేస్తున్నాడో. ఇంత గొప్ప పనిచేస్తున్న అమీర్ ను అనవసరంగా తిట్టిపారేశాం అనే ఫీలింగ్ ఇప్పుడు చాలామందికి కలుగుతోంది అంటే అతిశయోక్తి కానే కాదు.

    ఎప్పుడో :

    ఎప్పుడో :

    ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆమిర్ ఖాన్ తలచుకుంటే ఎప్పుడో రాజకీయాలవైపు అడుగు వెయ్యగలడు . అతను అడుగు పెడతా అంటే బీజేపీ కళ్ళకి అద్దుకుని మరీ తీసుకుంటుంది.

    రాజకీయాలు అవసరం లేదు:

    రాజకీయాలు అవసరం లేదు:

    కానీ ఆమిర్ అలాంటి పని చెయ్యలేదు, కారణం సేవ చెయ్యడానికి రాజకీయాలు అవసరం లేదు అని - అవి అతని సంకల్పాన్ని మట్టికరిపిస్తాయి అని అమీర్ ఫీలింగ్ అయుండవచ్చు.

    కోట్ల ఆఫర్లను వదులుకున్నాడు:

    కోట్ల ఆఫర్లను వదులుకున్నాడు:

    సత్యమేవజయతే కోసం అమీర్ కొన్ని కోట్ల ఆఫర్లను వదులుకున్నాడు... నష్టాలు వస్తాయని తెలిసీ మంగళ్ పాడే లాంటి సినిమాలు తీయటానికి ఒప్పుకున్నాడు.... లగాన్, రంగ్ దే బసంతీ, లాంటి సినిమాలలో దేశం మీద ఉండే ప్రేమని చాటుకున్నాడు...

    దేశ ద్రోహి

    దేశ ద్రోహి" అయ్యాడు.:

    కానీ ఈ దురదృష్టవంతుడే "పీకే" అనే ఒక్క సినిమాతో "దేశ ద్రోహి" అయ్యాడు... దేశాన్ని ఏదో అన్నాడని కాదు దేవుడు లేడన్నాడనీ..., ఇండియా పాకిస్థాన్ లమధ్య శాంతి ని కోరుకున్నాడనీ....

    అమీర్ ని అర్థం చేసుకున్నారు. :

    అమీర్ ని అర్థం చేసుకున్నారు. :

    అయితే ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ఇప్పుడు మహారష్ట్రలోని కొన్ని వేలమంది అమీర్ ని అర్థం చేసుకున్నారు.

    నిజమైన దేశభక్తి:

    నిజమైన దేశభక్తి:

    అమీర్ ఖాన్ లోని నిజమైన దేశభక్తిని తెలుసుకున్నారు. మీడియాకి ఈ సమాచారం అందించింది కూడా అమీర్ ఫౌండేషన్ ద్వారా సహాయాన్ని పొందిన గ్రామస్తులే కావటం గమనార్హం...

    English summary
    Aamir Khan’s Paani Foundation, Satyamev Jayate to solve water crisis
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X