»   » ఆమీర్‌ వ్యాఖ్యలపై స్నాప్‌డీల్‌ ప్రకటన

ఆమీర్‌ వ్యాఖ్యలపై స్నాప్‌డీల్‌ ప్రకటన

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: గత సోమవారం దిల్లీలోని రామ్‌నాథ్‌ గోయెంకా ఎక్సెలెన్స్‌ అవార్డు ప్రధాన కార్యక్రమంలో ఆమీర్‌ఖాన్‌ దేశంలో అసహనంపై మాట్లాడిన సంగతి తెలిసిందే. దీనిపై సర్వత్రా ఆగ్రహం వెల్లువెత్తింది. ఆమీర్‌ఖాన్‌ ...స్నాప్‌డీల్‌కి అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యల ప్రభావం స్నాప్‌డీల్‌పై కూడా పడింది.

దేశంలో అసహనంపై బాలీవుడ్‌ నటుడు ఆమీర్‌ఖాన్‌ చేసిన వ్యాఖ్యలపై తమకు ఎలాంటి సంబంధం లేదని ఈ-కామర్స్‌ సంస్థ స్నాప్‌డీల్‌ ఈరోజు ప్రకటించింది.

ఆమీర్‌ వ్యాఖ్యలతో ఏకీభవించని చాలా మంది స్నాప్‌డీల్‌ యాప్‌ని అన్‌ఇన్‌స్టాల్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యలు, అన్‌ఇన్‌స్టాల్‌ చేస్తున్న ఫోటోల్ని షేర్‌ చేశారు. స్నాప్‌డీల్‌ అంబాసిడర్‌గా ఆమీర్‌ని తొలగించేంత వరకు ఈ మొబైల్‌ యాప్స్‌ని తాము వినియోగించేది లేదని తేల్చిచెప్పారు.

వినియోగదారులు ఇలా ప్రకటించినప్పటికీ స్నాప్‌డీల్‌ మాత్రం నిన్నటి వరకు ఈ సంఘటనపై నోరు విప్పలేదు. ఈ రోజు మాత్రం అధికారిక ప్రకటన జారీ చేసింది. ఆమీర్‌ వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధంలేదని అది ఆయన వ్యక్తిగతమని నిర్వాహకులు చెప్పారు. తమ సంస్థ భారత్‌కి చెందినది కావడం తమకు ఎంతో గర్వకారణంగా వుందన్నారు.

Aamir Khan’s remark: Snapdeal issues statement

బాలీవుడ్‌ నటుడు అమీర్‌ ఖాన్‌ వివాదాస్పర వ్యాఖ్యలు నేపథ్యంలో ఆయనపై కాన్పూర్‌లో కేసు నమోదు అయింది. దేశంలో మత విద్వేషాలు రగిలిస్తున్నారని పేర్కొంటూ కొంతమంది ఆయనపై కార్పూర్‌ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

అమీర్ ఖాన్ మాట్లాడుతూ... 'భారత్‌ నా మాతృభూమి, ఈ గడ్డపై జన్మించడం నా అదృష్టం' అని బాలీవుడ్‌ నటుడు ఆమీర్‌ఖాన్‌ అన్నారు. అసహనంపై తాను చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతున్న నేపథ్యంలో ఆయన వివరణ ఇచ్చారు.

భారత్‌ విడిచి వెళ్లే ఉద్దేశం తనకు, తన భార్యకు లేదని స్పష్టం చేశారు. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. తన ఇంటర్వ్యూను పూర్తిగా చూడనివారే తనను వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. తనకున్న దేశభక్తికి ఎవరి కితాబు అవసరం లేదని అన్నారు.

English summary
In a press statement, Snap deal said, "Snapdeal is neither connected nor plays a role in comments made by Aamir Khan in his personal capacity. Snapdeal is a proud Indian company built by passionate young Indians focused on building an inclusive digital India. Everyday we are positively impacting thousands of small businesses and millions of consumers in India. We will continue towards our mission of creating one million successful online entrepreneurs in India."
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu