»   » ఇదేంటీ ఇలా ఉన్నాడు...!? మరీ వెరైటీ లుక్ లో అమీర్ ఖాన్

ఇదేంటీ ఇలా ఉన్నాడు...!? మరీ వెరైటీ లుక్ లో అమీర్ ఖాన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అమీర్ ఖాన్‌ మరో కొత్త లుక్‌లో కనిపించనున్నాడు. తన పాత మేనేజ అద్వైత్ చందన్ దర్శకుడిగా పరిచయం అవుతున్న కొత్ల సినిమాలో ఆయన అతిథి పాత్రలో నటిస్తుండగా, ఇందులో ఆయనకు సంబంధించిన లుక్‌ ఒకటి సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. లగాన్ సినిమా నుంచి పీకే వరకు ఎన్నో ప్రయోగాలు చేశాడు ఆమిర్. త్రీ ఇడియట్స్‌లో స్టూడెంట్‌గా నటించినా.. పీకేలో ఏలియన్‌గా కనిపించినా తన మార్కు నటనను చూపించాడు. తాజాగా దంగల్‌లో నటిస్తున్నాడు. ఈ లుక్ కూడా అద్బుతంగా ఉందంటూ మంచి రెస్పన్సే వచ్చింది. అయితే డిసెంబర్ లో దంగల్ రానుండగా.... ఇదివరలో తన దగ్గర మేనేజర్ గా పని చేసిన చందన్ కోరిక మేరకు అతను తీస్తున్న ఓ సినిమాలో కొద్దిసేపు కనిపిస్తాడట.

Aamir Khan in strange head gear and pointed moustache for his New Movie

పొడవైన మీసకట్టు, వింత గడ్డం, విచిత్రమైన జ్యూవెలరీతో అమీర్ లుక్ ఫన్నీగా ఉంది. తలకి ఒక హెడ్ గేర్ కూడా కనిపిస్తోంది. ఇందులో ఆయన మ్యూజిక్‌ మెంటర్‌ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. పేరుకు అతిథి పాత్రే అయిన ఈ సినిమాలో ఆమిర్ చాలా సేపు తెర మీద కనిపించనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమా అయిపోతే అమితాబ్ తో కలిసి చేయనున్న థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ మొదలు కానుంది.సోలో హీరోగానే ఒక రేంజ్ హిట్ కొట్టే అమీర్ ఇక ఇండియన్ మూవీ బాద్షా తో చేతులు కలిపితే ఇంకెలా ఉంటుందో ఊహించండి.

అమీర్ ఖాన్ , అమితాబ్ ఒకే తెర మీద.. ఆమీర్‌ ఖాన్‌ చేసిన ట్వీట్‌తో ఆ విషయం ఖరారైంది. అమితాబ్‌తో కలసి నటిస్తుండటం ఆనందంగా ఉందంటూ ఆమీర్‌ ట్వీట్‌ చేశారు. ''నేనెంత కాలంగానో ఎదురుచూస్తున్న సమయం ఎట్టకేలకు వచ్చేసింది. అమితాబ్‌తో కలసి నటించాలన్న కోరిక నెరవేరబోతోంది.జీవితంలో అనుక్షణం నేను ఆరాధించిన వ్యక్తితో తెరను పంచుకోబోతుండటం ఉద్వేగంగా ఉంది.అందుకు ఆదిత్య చోప్రా, విజయ్‌కృష్ణలకు ధన్యవాదాలు. చిత్రీకరణ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అంటూ.... మొన్న చేసిన ట్వీట్ కే అభిమానులు ఉత్సాహంగా ఉంటే ఇప్పుడు వచ్చిన ఈ సీక్రేట్ సూపర్ స్టార్ లుక్ అమీర్ అభిమానుల్లో మరింత ఉత్సాహం తెచ్చింది.

Aamir Khan in strange head gear and pointed moustache for his New Movie

ప్రస్తుతం 'దంగల్' సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్న ఆమిర్.. ఈ ఏడాది ఆఖర్లో 'థగ్స్ ఆఫ్ హిందుస్తాన్' షూటింగ్‌లో పాల్గొంటాడు. 2018 దీపావళికి ఈ సినిమా రిలీజ్ అని ఇప్పటికే ప్రకటించేశారు. అమితాబ్‌ బచ్చన్‌ కూడా ఆమీర్‌తో నటిస్తుండటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. 'కన్‌ఫెషన్స్‌ ఆఫ్‌ ఎ థగ్‌' అనే నవల ఆధారంగా తెరకెక్కబోతున్న ఈ సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాది మొదలు కానుంది.2018 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పుడు అథిది పాత్రలో కనిపించే సినిమా మాత్రం దంగల్ తర్వాత, థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ కి మధ్యలో స్పెషల్ గిఫ్ట్ అన్న మాట...

English summary
Picture of Aamir Khan sporting a strange headgear and pointed mustache have surfaced online. Many claim that this is the first look of his upcoming film with his ex-manager Advait Chandan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu