For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రక్తంతో అమీర్ ప్రేమ లేఖ.. ముఖం మీద కొట్టిన లవర్.. అబార్షన్ చేసుకోమని సలహా..

  By Rajababu
  |

  రీల్ లైఫ్‌లో బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అనడంలో ఎలాంటి సందేహాం అక్కర్లేదు. కానీ రియల్ లైఫ్‌లో.. అదీ ప్రేమ విషయంలో అమీర్ ఫర్‌ఫెక్ట్ కాదనే విషయం తేలిపోయింది. ఖయామత్ సే ఖయామత్ తక్ చిత్రం తర్వాత హీరోగా నిలదొక్కుకునే పరిస్థితుల్లో అప్పటి వర్థమాన తార రీనా దత్తాతో ప్రేమలో పెడ్డారు. అయితే అది వన్ సైడ్ లవ్ కావడంతో తన ప్రేమను నిరూపించుకోవడానికి నానా కష్టాలు పడాల్సి వచ్చిందట. రీనాదత్తాతో ప్రేమకు సంబంధించిన ఆసక్తికరమైన అంశం మీడియాలో తాజాగా వెలుగులోకి వచ్చింది. అమీర్ జీవితంలో కీలకమైన విషయాలు ఏమిటంటే..

  చివాట్లు పెట్టిన రీనా

  చివాట్లు పెట్టిన రీనా

  అమీర్ ఖాన్ ప్రేమ సినిమా కథ మాదిరిగానే మొదలైంది. రీనా, అమీర్ ఇరుగు పొరుగు వారు. గంటల కొద్ది కిటికీల్లోంచి చూసుకొనే వారు. కానీ రీనా కళ్లలోకి చూసి మనసులోని ప్రేమను చెప్పాలంటే గుండె జారినంత పనైయ్యేది. చివరకు ఎలానో ధైర్యం తెచ్చుకొని మనసులోని మాటను చెప్పాడు కానీ.. రీనా చివాట్లు పెట్టి ప్రేమను తిరస్కరించింది. అయినా అమీర్ తన ప్రయత్నం మానలేదు.

  రక్తంతో ప్రేమలేఖ..

  రక్తంతో ప్రేమలేఖ..

  ప్రేమ గుడ్డిది అంటారు కదా. అలానే అమీర్ ఖాన్ నటి రీనాదత్తాతో గుడ్డిగా ప్రేమలో పడ్డారు. ఆమె అటెన్షన్‌ను తనవైపు తిప్పుకోవాలని తెగ ప్రయత్నించాడు. కానీ మొండిఘటమైన రీనా.. అమీర్ జిమ్మికులకు తలవంచలేదు. దాంతో అమీర్ తన రక్తంతో ప్రేమ లేఖను రాసి తన ప్రేమను నిరూపించుకోవాలనుకొన్నాడు. అనుకున్నదే తడువుగా రక్తంతో ప్రేమలేఖను రాసి రీనా చేతిలో పెట్టాడు.

  చీప్ ట్రిక్కులు ప్రదర్శించకు

  చీప్ ట్రిక్కులు ప్రదర్శించకు

  రక్తంలో తడిసిన లవ్ లెటర్ ను చూసి అమీర్‌తో రీనా ప్రేమలో పడిపోయిందంటే పొరపాటే. ప్రేమ లేఖను తీసి ముఖాన విసిరివేసిందట. ఇదేం పని? ఇలా చీప్ ట్రిక్కులు ప్రదర్శించకు. మరోసారి ఇలాంటి వెధవ పనులు చేస్తే ఊరుకోను అని రీనా తెగేసి చెప్పిందట. దాంతో ప్రేమను గెలుచుకోవడం ఇది సరైన పద్దతి కాదని అమీర్ నిర్ణయించుకొన్నాడట. ఆ తర్వాత నానా కష్టాలు పడి రీనా ప్రేమను గెలుచుకొని రీనా భార్యగా చేసుకొన్నాడు.

  2002లో విడాకులు..

  2002లో విడాకులు..

  రీనాదత్తాను వివాహం చేసుకొన్న తర్వాత అమీర్ దాంపత్య జీవితం దాదాపు 16 ఏళ్లు కొనసాగింది. ఇద్దరు పిల్లలకు వీరు జన్మనిచ్చారు. కానీ వారి వైవాహిక జీవితం ఒక్కసారిగా కుదుపుకు లోనైంది. చివరకు 2002లో వారు విడాకులు తీసుకొన్నారు. రీనా, అమీర్ విడాకులు తీసుకొన్నప్పటికీ వారి మధ్య ఇంకా ప్రేమ అలానే ఉందని చెప్పుకొంటారు.

  మా బంధం విడిపోనిది..

  మా బంధం విడిపోనిది..

  విడాకులు తీసుకొన్న తర్వాత కూడా రీనా అమీర్‌ ఫ్యామిలీతో మంచి సంబంధాలను ఇప్పటికీ కొనసాగించడం గమనార్హం. ఒకనొక సమయంలో అమీర్ మాట్లాడుతూ.. చట్టం దృష్టిలో రీనాదత్తాకు దూరం అయ్యాను. కానీ మా బంధం ఇంకా బలంగా ఉంది. ఓ పేపర్ ముక్క నా బంధాన్ని విడదీయలేదు. నా జీవితంలో రీనా చాలా కీలకమైనది. ఆమె ఎప్పుడూ నాతోనే ఉంటుంది అని అన్నారు.

  పూజాభట్ కారణమట..

  పూజాభట్ కారణమట..

  రీనాదత్‌‌తో విభేదాలు తలెత్తడానికి కారణం అమీర్ కొనసాగించిన అఫైర్లే కారణమని చెప్పుకొంటారు. అందులో ఒకటి దర్శకుడు మహేశ్ భట్‌ కూతురు పూజా భట్‌తో అఫైర్‌గా చెప్పుకొంటారు. ఇలాంటి ఆఫైర్లు అమీర్ జీవితంలో చాలానే ఉంటాయంటారు. వాటిలో బ్రిటీష్ జర్నలిస్టుతో అఫైర్ చాలా సీరియస్‌గా సాగిందట.

  బ్రిటన్ జర్నలిస్టుతో

  బ్రిటన్ జర్నలిస్టుతో

  బ్రిటిష్ జర్నలిస్టు జెస్సీకా హైన్స్ తో అమీర్ ప్రేమాయణం సాగించినట్లు పుకార్లు షికార్లు చేశాయి. అమీర్ హీరోగా నటించిన గులాం చిత్ర షూటింగ్ సమయంలో జెస్సీకాతో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. దీంతో వారు సహజీవనం చేశారు. ఆ సమయంలో జెస్సీకా గర్భం దాల్చింది. ఆ విషయం తెలిసిన అమీర్... అమెను గర్భస్రావం చేయించుకోవాలని సూచించాడట. అందుకు ఆమె ససేమిరా అని... బాబుకు జన్మ నిచ్చింది. అతడి పేరు జాన్. ప్రస్తుతం ఆ తల్లీకొడుకులు లండన్ లో నివసిస్తున్నారు. జాన్ జన్మించడంతో జెస్సీకాతో ప్రేమాయణానికి అమీర్ స్వస్థి పలికాడట.

  కిరణ్ రావుతో పెళ్లి..

  కిరణ్ రావుతో పెళ్లి..

  రీనా దత్తాతో విడిపోయిన తర్వాత అమీర్ ఖాన్ డిప్రషన్ కి గురైయ్యాడు. ఆ పరిస్థితుల నుంచి బయటపడటానికి లగాన్ షూటింగ్ లో కిరణ్ రావుతో ప్రేమలో పడ్డాడు. కిరణ్ రావు లగాన్ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. చివరకు 2005, డిసెంబర్ 25న కిరణ్ రావును అమీర్ వివాహం చేసుకున్నాడు. వారిద్దరికి ఆజాద్ అనే కుమారుడు ఉన్నాడు.

  English summary
  Aamir Khan is a flawless actor on screen but when it comes to his off screen we can't say the same for there have been a number of rumours surrounding his married life and affairs. Aamir Khan had once written a love letter in blood to his first wife Reena Dutta.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X