»   » ఫోటోలు: ఫ్యాన్స్ ముందుకు బిగ్‌బి మనవరాలు

ఫోటోలు: ఫ్యాన్స్ ముందుకు బిగ్‌బి మనవరాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : ఈ ప్రపంచంలోని ప్రతి వ్యక్తీ కీర్తి, ఐశ్వర్యం సంపాదించాలని కోరుకుంటాడు. అయితే ఈ రెండు కూడా అంత ఈజీగా దక్కవు. అయితే కొందరికి మాత్రం అదృష్టంగా ఈ రెండూ పుట్టికతోనే లభిస్తాయి. దేశ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంటారు. అలాంటి వారు కోట్లలో ఒకరు మాత్రమే ఉంటారు. అలాంటి వారిలో ఒకరు అమితాబ్ మనవరాలు ఆరాధ్య.

అమితాబ్ అభిమానులు ప్రతి ఆదివారం వేలాదిగా ఆయన నివాసానికి తరలి వస్తూ ఉంటారు. దేశం నలుమూలల నుంచి ముంబై చేరుకుని తమ అభిమాన హీరోను రియల్‌గా చూసి మురిసిపోదామనుకునే అభిమానులు ఎందరో. ప్రతి ఆదివారం అభిమానులు రావడం, అమితాబ్ తన బాల్కనీలోకి వచ్చి వారికి అభివాదం చేయడం ఎప్పటి నుండో జరుగుతున్న తంతే.

తాజాగా ఈ ఆదివారం అమితాబ్ తొలిసారిగా తన మనవరాలు ఆరాధ్యతో కలిసి అభిమానుల ముందుకు వచ్చారు. వారితో పాటు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ కూడా వచ్చి అభిమానులకు అభివాదం తెలిపారు. ఊహించని విధంగా బచ్చన్ ఫ్యామిలీని మొత్తం రియల్‌గా చూసే అవకాశం రావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

ఇందుకు సంబంధించిన ఫోటోలను అమితాబ్ బచ్చన్ తన ఫేస్ బుక్ ద్వారా షేర్ చేసారు....

అమితాబ్ బచ్చన్ తన ఫ్యామిలీ మెంబర్లతో కలిసి అభిమానులకు అభివాదం చేస్తున్న దృశ్యాన్ని ఇక్కడ వీక్షించవచ్చు.

ఈ ఆదివారం అమితాబ్ ను చూసేందుకు వేలాదిగా అభిమానులు తరలి వచ్చారు. అందుకు ఈ ఫోటోయే నిదర్శనం.

అమితాబ్ బచ్చన్ ముద్దుల మనవరాలు ఆరాధ్య పుట్టకతోనే దేశ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకుంది.

ఈ ఫోటోలను అమితాబ్ తన ఫేస్ బుక్ పేజీ ద్వారా షేర్ చేసారు. ‘ఈ ఆదివారం అభిమానులకు సర్ ప్రైజ్. ఆరాధ్య కూడా వారికి అభివాదం చేసేందుకు బయటకు వచ్చింది. ఈ రోజు చాలా మంది తరలి వచ్చారు' అని పేర్కొన్నారు.

అమితాబ్ వచ్చన్ ప్రస్తుతం ఉంటున్న నివాసం పేరు ‘జల్సా'.

English summary
Every person on this earth has to struggle to earn fame and wealth. Especially, when we talk about mass hysteria, it certainly doesn't come in one day. But, here's someone, who made the nation go crazy, even before birth.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu