»   »  ఆమె నా చెల్లెలు కాదు: ఆరాధ్య పై హీరోయిన్ అంజలి ఫైర్

ఆమె నా చెల్లెలు కాదు: ఆరాధ్య పై హీరోయిన్ అంజలి ఫైర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

అవటానికి తెలుగమ్మాయే అయినా తమిళ సినిమా జర్నీ తో బాగా పాపులర్ అయ్యింది అంజలి ఇక ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా రావటం, దాన్లో సీత పాత్ర చేసిన అంజలికి మంచి మార్కులే పడటం తో ఇక ఈమె కెరీర్ ఊపందుకుంటుందనే అనుకున్నారంతా... అదే జరిగేది కూడా అయితే అదే సమయం లో, కిడ్నాప్, ఇంట్లో గొడవలూ అంటూ వరుస వివాదాల్లో పడి చేజేతులా కెరీర్ని గంగలో కలిపేసుకుంది అంజలి. తమిళ్‌లో ఒకటీ అరా పర్లేదు గానీ టాలీవుడ్ లో అయితే అసలు అవకాశాలే లేకుండాపోయాయి. నెమ్మదిగా వార్తలలో కూడా కనిపించటం మానేసింది...

అంజలి పోలికలతోనే ఉండటం

అంజలి పోలికలతోనే ఉండటం

అయితే ఉన్నట్టుండీ గత వారం నుంచీ అంజలీ మళ్ళీ న్యూస్ టాపిక్ అయ్యింది. అదీ ఆరాధ్య అనే ఇంకో అమ్మాయి వల్ల, హీరోయిన్‌గా అంజలి చెల్లెలంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఆరాధ్య పేరు హల్ చల్ చేస్తోంది. ఆమె చేసిన ఒక ఫొటో షూట్ హాట్ టాపిక్ అయింది. కొంచెం అంజలి పోలికలతోనే ఉండటంతో తన గురించి మీడియాలో బాగానే చర్చ నడిచింది.

ఆరాధ్య తన చెల్లెలు కాదంట

ఆరాధ్య తన చెల్లెలు కాదంట

తాను ఇప్పటికే తమిళ సినిమాల్లో నటిస్తున్నానని.. తెలుగులోనూ సినిమా చేయబోతున్నానని చెబుతూ అంజలి పేరు కూడా ప్రస్తావించింది ఈ ఆరాధ్య.ఐతే ఇప్పుడు అంజలి లైన్లోకి వచ్చి ఆరాధ్య తన చెల్లెలే కాదంటుండటం విశేషం. నేరుగా ఆ విషయం చెప్పలేదు కానీ.. ఆరాధ్య తన చెల్లెలు కాదంటూ తన మేనేజర్ పెట్టిన ట్వీట్‌ను రీట్వీట్ చేసింది అంజలి.

మీడియాలో వార్తలు అవాస్తవం

మీడియాలో వార్తలు అవాస్తవం

"అంజలి చెల్లెలు సినిమాల్లోకి వస్తోందని మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం. ఆమెకు ఒక అక్క మాత్రమే ఉంది. ప్రస్తుతం ఆమె పెళ్లి చేసుకుని ఆనందంగా జీవితం గడుపుతోంది" అని అంజలి మేనేజర్ రియాజ్ అహ్మద్ ట్విట్టర్లో తెలియజేశాడు.

ఆమె పేరును ఎలా వాడుకుంటోందీ

ఆమె పేరును ఎలా వాడుకుంటోందీ

దీన్ని అంజలి రీట్వీట్ చేయడాన్ని బట్టి ఆరాధ్య తన చెల్లెలు కాదని స్పష్టం చేస్తున్నట్లే. అమరి అంజలి చెల్లెలు కాకపోయినా.. ఆమె పేరును ఆరాధ్య ఎలా వాడుకుంటోందన్నది అర్థం కాని విషయం. అంజలికి ఆమె కుటుంబ సభ్యులతో గొడవలున్న నేపథ్యంలో దీని వెనుక మతలబేంటో జనాలకు అర్థం కావడం లేదు.

English summary
Soon after a press meet organised to introduce a new actress, Aaradhya who is actress Anjali’s sister, the latter’s PR wing issued a statement saying that she did not have a younger sister
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu