»   » గోపీచంద్ "ఆరడుగుల బుల్లెట్" ట్రైలర్ విడుదల !!

గోపీచంద్ "ఆరడుగుల బుల్లెట్" ట్రైలర్ విడుదల !!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా ప్రముఖ డైరెక్టర్ బి.గోపాల్ తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆరడుగుల బుల్లెట్'. జయా బాలాజీ రియల్ మీడియా పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రం ట్రైలర్ శుక్రవారం రిలీజ్ చేసారు.

తాండ్ర రమేష్ నిర్మాణ సారధ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో గోపీచంద్ సరసన నయనతార కథానాయికగా నటించగా.. మణిశర్మ సంగీత సారధ్యం వహించారు.

ట్రైలర్ విడుదల సందర్భంగా చిత్ర నిర్మాత తాండ్ర రమేష్ మాట్లాడుతూ.. "ఇంద్ర, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు చిత్రాల అనంతరం బి.గోపాల్ నుంచి వస్తున్న మరో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్ టైనర్ "ఆరడుగుల బుల్లెట్". ఈ చిత్రంలో గోపీచంద్ క్యారెక్టర్ ను బి.గోపాల్ మలిచిన తీరు.. నయనతార గ్లామర్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి. అలాగే సినిమా కోసం స్విట్జర్లాండ్, పోర్చుగల్ లాంటి దేశాల్లో చిత్రీకరించిన పాటలు ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకొంటాయి. ప్రముఖ రచయితలు వక్కంతం వంశీ అందించిన కథ, అబ్బూరి రవి మాటలు సినిమాకి హైలైట్స్ గా నిలుస్తాయి. గోపీచంద్ కెరీర్ లో ఈ చిత్రం ఓ మైలురాయిగా నిలుస్తుంది" అన్నారు.

ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, అభిమన్యు సింగ్, చలపతిరావ్, సలీం బేగ్, ఉత్తేజ్, జయప్రకాష్ రెడ్డి, ఫిరోజ్ అబ్బాసి, రమాప్రభ, సురేఖావాణి, సన, సంధ్యా జనక్, మధునందన్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కథ: వక్కంతం వంశీ, మాటలు: అబ్బూరి రవి, ఫైట్స్: కనల్ కణ్ణన్, సినిమాటోగ్రఫీ: బాల మురుగన్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర్రావు, ఆర్ట్: నారాయణ రెడ్డి, నిర్మాత: తాండ్ర రమేష్, దర్శకత్వం: బి.గోపాల్!

English summary
Macho action hero Gopichand and sensational mass director B Gopal’s most awaited high voltage mass action entertainer Aaradugula Bullet trailer is released today. While the movie is releasing in May 3rd week, makers are unveiling the trailer to kick start the grand promotions.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu