»   » భూలోకానికి వచ్చిన రంభ ఆర్తి అగర్వాల్

భూలోకానికి వచ్చిన రంభ ఆర్తి అగర్వాల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

నువ్వు నాకు నచ్చావ్ చిత్రంతో తెరంగ్రేటం చేసి ఆ తర్వాత చాలా సినిమాలు చేసి ఓ రోజు పెళ్ళి చేసుకుని బై చెప్పేసింది ఆర్తి అగర్వాల్. అయితే పెళ్ళి మూన్నాళ్ళ ముచ్చటలా కరిగిపోవటంతో తనను అక్కరకు తీసుకున్న వెండితెరనే ఆశ్రయించి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. మొన్న పోసాని ప్రక్కన జెంటిల్ మెన్ లో చేసిన ఆమె ఆ తర్వాత నీలవేణి అనే చిత్రంలోనూ బక్కయింది. తాజాగా లక్కీ మీడియా సంస్థ నిర్మిస్తున్న 'బ్రహ్మలోకం టూ యమలోకం' (వయా భూలోకం) చిత్రంలో ఆర్తి నటిస్తోంది. ఇంద్రలోకం నుంచి భూలోకం వచ్చిన రంభగా ఆమె కనిపిస్తుంది. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, శివాజీ, సోనియా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. బెక్కెం వేణుగోపాల్‌, రూపేష్‌ డి.గోహిల్‌ నిర్మాతలు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ.. ''రంభ పాత్ర ఆసక్తికరంగా ఉంది. తప్పకుండా నా పాత్ర, ఈ సినిమాలోని వినోదం ప్రేక్షకులకు నచ్చుతాయి'' అంటోంది ఆర్తి. ఇదైనా వర్కవుట్ అయి ఆమెకు మరిన్ని ఆఫర్స్ ఇస్తాయని ఆశిద్దాం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu