»   » అప్పుడు ప్రేమలో పడ్డా, కెరీర్ నాశనమైంది: ఆర్తీ అగర్వాల్

అప్పుడు ప్రేమలో పడ్డా, కెరీర్ నాశనమైంది: ఆర్తీ అగర్వాల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వరుసగా సినిమాలు వస్తున్నప్పుడు వాటిని సైన్‌ చేయకుండా ప్రేమలో పడ్డానని అందాల తార ఆర్తీ అగర్వాల్ చెప్పారు, పెళ్లి చేసుకుని, సెటిల్‌ అవ్వాలని కలలు కన్నానని, దాంతో నా కెరీర్‌ మొత్తం నాశనమైందని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. ఇప్పుడు సినిమాలు చేద్దామన్నా కూడా ఒక్క అవకాశం కూడా రావడం లేదు. తెలుగు, తమిళ్‌ ఇలా ఎక్కడ ఏ చిన్న అవకాశం వచ్చినా నటించడానికి తాను సిద్ధంగా ఉన్నానిని ఆర్తి అగర్వాల్ అంటోంది.

తెలుగు సినీ పరిశ్రమంలో ఒక మెరుపులా మెరిసిన హీరోయిన్‌ ఆర్తీ అగర్‌వాల్‌. అప్పట్లో విక్టరీ వెంకటేష్‌ పక్కన ‘నువ్వు నాకు నచ్చావ్‌' సినిమాతో లైమ్ లైట్‌లోకి వచ్చిన ఈ సుందరి వరుసపెట్టి చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, మహేష్‌బాబు, ఎన్టీఆర్‌, ప్రభాస్‌ ఇలా అందరితోనూ సినామాలు చేసింది.

Aarthi agarwal

ఓ యువ హీరో ప్రేమలో పడి, పెళ్లి చేసుకుందామని అనుకుంది. కానీ అది విఫలమైంది. దాంతో ఆమె మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆ తర్వాత అమెరికాలో కొంతకాలం ఉంది. ఇప్పుడిప్పుడే ఆమెకు సినిమా అవకాశాలు మళ్ళీ వస్తున్నాయని అంటున్నారు.

కాగా, ఇటీవల ఆర్తి అగర్వాల్‌ తన జన్మదిన వేడుకలను హైరాబాదు సమీపంలోని పీర్జాదిగూడలోని అల్పా అనాధ బాలల ఆశ్రమంలో ఘనంగా జరుపుకున్నారు. తండ్రి సిద్దాంత్‌ అగర్వాల్‌ సోదరి అతిథి అగర్వాల్‌ సోదరుడు ఆకాశ్‌ అగర్వాల్‌తో పాటు ఫ్యాన్స్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.బాలుతో కలసి వచ్చిన ఆర్తి అగర్వాల్‌ అనాధ పిల్లల నడుమ బర్త్‌డే కేక్‌ను కట్‌చేసి తన ఆనందాన్ని పంచుకున్నారు.

ఈ సందర్భంగా ఆమె అనాధ బాలలకు బట్టలు పండ్లను పంపిణీ చేయడంతో పాటు ఆశ్రమంలో ఉంటున్న పిల్లలందరికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమం నిర్వాహకులు ప్రవీణ్‌కుమార్‌తో పాటు అనాధ పిల్లలు పాల్గొన్నారు.

English summary
Aarthi Agarwal wants to act once again in films, if she get chance in Telugu or Tamil.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu