»   » హిందీ రీమేక్ కు అంతా సిద్దం, తెలుగే తేలలేదు, భయపడుతున్నారా?

హిందీ రీమేక్ కు అంతా సిద్దం, తెలుగే తేలలేదు, భయపడుతున్నారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: హీరోలు ఇమేజ్ ను పక్కన పెట్టి ప్రయోగాలకు సిద్ధమవుతుండటంతో ఇతర భాషల్లో తెరకెక్కిన ప్రయోగాత్మక చిత్రాల రీమేక్ లకు మంచి డిమాండ్ ఏర్పడుతోంది. ఇప్పటికే దృశ్యం, ఊపిరి లాంటి సినిమాలు ఇదే బాటలో తెరకెక్కి ఘనవిజయాలు సాధించాయి. తాజాగా మరో మలయాళ సినిమా ఈ లిస్ట్ చేరబోతోంది.

మోహన్‌లాల్‌ హీరోగా మలయాళంలో తెరకెక్కిన ఒప్పం' సినిమాను ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్‌ చేసేందుకు రంగం సిద్దమైంది. ఈ చిత్రాన్ని మోహన్ లాల్ తన బ్యానర్ ఆశీర్వాద్ ఫిల్మ్స్ పై రీమేక్ చేయనున్నారు. ప్రియదర్శన్ డైరక్షన్ లోనే ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రియదర్శన్ గతంలో హిందీలో సూపర్ హిట్స్ ఇచ్చి ఉన్నారు.

దాంతో ఖచ్చితంగా ఈ ప్రాజెక్టుకు అక్కడ కూడా మంచి మార్కెట్ వస్తుందని భావిస్తున్నారు. ఈ సినిమాతో ఆశీర్వాద్ ఫిల్మ్స్ హిందీలో లాంచ్ కానుంది. ఇన్నాళ్లూ ఆశీర్వాద్ ఫిల్మ్స్ పై కేవలం మోహన్ లాల్ హీరోగానే చిత్రాలు వచ్చాయి. అయితే మొదటి సారిగా వేరే హీరో ఈ బ్యానర్ లో చేయబోతున్నారు. ఆ హీరో అక్షయ్ కుమార్ అయ్యి ఉండే అవకాసం ఉంది.

Aashirvad Cinemas To Make Bollywood Debut With Oppam Remake

ఇక మరో ప్రక్క తెలుగులో ఈ సినిమాని డబ్ చేసి వదలాలా లేక ఇక్కడ హీరోతో రీమేక్ చేస్తే మేలా అనే విషయం ఇంకా తేలలేదని తెలిసింది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం డబ్బింగ్ పనులు మొదలెట్టారని వినపడుతోంది. అన్నీ కుదిరితే వెంకటేష్ కానీ నాగార్జున తో కానీ ఈ సినిమాని తెలుగులోకి తెస్తారు.

అయితే మోహన్ లాల్ స్దాయి నటన చేయగలమా అని మన హీరోలు ఆలోచనలో పడ్డట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. ముఖ్యంగా హీరో గుడ్డివాడుకావటం తో హీరో తన నటనలో మంచి స్దాయిని చూపెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే చేస్తే మన హీరోలకు మంచి పేరు కూడా వచ్చే అవకాసం ఉంది.

మరో ప్రక్కన ఈ సినిమాను తెలుగులో చేస్తే బావుంటుందని నాగార్జున ఆలోచిస్తున్నారట. "ఓం నమో వేంకటేశాయ' సినిమా తర్వాత నాగార్జున "ఒప్పం' రీమేక్‌లో నటించే అవకాశం ఉందని పరిశ్రమలో ప్రముఖంగా వినిపిస్తోంది. ఇటీవల ఊపిరి సినిమాలో వీల్‌ ఛైర్‌కే పరిమితమైన పాత్రలో చక్కటి నటనను ప్రదర్శించిన నాగార్జున ఈ చిత్రంలోని అంధుడైన లిఫ్ట్‌ ఆపరేటర్‌ పాత్ర ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోవాలనుకుంటున్నారట.

ఓ హత్య కేసులో నిందితుడ్ని అంధుడైన లిఫ్ట్‌ ఆపరేటర్‌ ఎలా పట్టుకున్నాడు? అన్న అంశంతో రూపొందిన ఈ చిత్రానికి మలయాళ ప్రేక్షకులు పట్టంకట్టారు. ప్రియదర్శన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలైన మూడువారాల్లో 27 కోట్ల రూపాయలను వసూలు చేసినట్లు సమాచారం.

English summary
Aashirvad Cinemas is all set to make its debut in Bollywood. The banner will enter the industry by producing the remake of Oppam, which will be directed by Priyadarshan, himself. Oppam Hindi remake, which will start rolling in 2017, reportedly stars Akshay Kumar in the lead role.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu