»   » అజిత్ ‘ఆట ఆరంభం’ విడుదల తేదీ ఖరారు

అజిత్ ‘ఆట ఆరంభం’ విడుదల తేదీ ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అజిత్ హీరోగా నటించిన తమిళ చిత్రం 'ఆరంభం'. విష్ణువర్థన్ దర్శకుడు. ఆర్య, రానా, నయనతార, తాప్సీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ఓమిక్స్ క్రియేషన్స్ పతాకంపై డా.జి.శ్రీనుబాబు 'ఆట ఆరంభం'పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 6 వ తేదీన ప్రేక్షకుల ముందుకొస్తోంది.

నిర్మాత మాట్లాడుతూ... 'తమిళంలో సరికొత్త పంథాలో తెరకెక్కిన ఈ చిత్రం అక్కడ అఖండ విజయాన్ని సాధిస్తోంది. ప్రముఖ నిర్మాత ఏ.ఎం. రత్నం నిర్మించి ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్తున్నందుకు ఆనందంగా వుంది. ఈ నెల 6న భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. అజిత్ నటన, నయన గ్లామర్, విష్ణువర్థన్ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. తెలుగు ప్రేక్షకులనూ ఈ సినిమా ఆకట్టుకుంటుందన్న నమ్మకముంది' అన్నారు.

ఇఖ జిత్‌ హీరోగా నయనతార కాంబినేషన్ లో విష్ణువర్దన్‌ దర్శకత్వంలో తాజాగా విడుదలైన 'ఆరంభం' కురిపించిన కాసుల వాన.. మరోమారు కోలీవుడ్‌ సత్తాను చాటింది. విడుదలైన పదిహేను రోజుల్లోనే రూ.113 కోట్లకు పైగా రాబట్టిందని కోలీవుడ్‌ వర్గాల అనధికార సమాచారం.

ఇక అజిత్, ఆర్య నటన, నయనతార, తాప్సీ గ్లామర్, విష్ణువర్థన్ టేకింగ్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణలు. ఈ చిత్రానికి సంగీతం: యువన్‌శంకర్‌రాజా, ఫొటోగ్రఫీ: ఓంప్రకాశ్, నిర్మాత: డా.శ్రీనుబాబు జి., దర్శకత్వం: విష్ణువర్థన్.

English summary
Actor Ajith's latest flick, Arrambam will be released in Telugu. The film is titled Aata Arrambam and is expected to release on December 6. The film stars Nayanthara, Rana Daggubati, Taapsee and Arya along with Ajith.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu