ప్రభాస్ పెళ్లి శుభలేఖ.... అందరూ షాక్! (ఫోటో)
హైదరాబాద్: టాలీవుడ్లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్లలో బాహుబలి స్టార్ ప్రభాస్ ఒకరు. ‘బాహుబలి' సినిమా కోసం తన పెళ్లిని సైతం త్యాగం చేసాడు. ప్రభాస్ పెళ్లి మ్యాటర్ టాలీవుడ్ హాట్ టాపిక్. ఆ మధ్య ప్రభాస్ భీమవరం అమ్మాయిని పెళ్లాడబోతున్నట్లు వార్తలు కూడా హల్ చల్ చేసాయి.
ఇలాంటి హాట్ విషయాలను వాడుకోవడంలో సినిమా వాళ్లను మించిన వారు ఉండరు. ఇపుడు ప్రభాస్ పెళ్లి అంశం ప్రస్తావనతో ఏకంగా ఓ సినిమానే వస్తోంది. ఆ సినిమాకు ఏకంగా ప్రభాస్ పెళ్లి అనే టైటిల్ పెట్టారు. ప్రభాస్ పెళ్లి శుభలేఖ పేరుతో పోస్టర్ కూడా రిలీజ్ చేసారు.

‘ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి' అనే టైటిల్ తో సాగే ఈ సినిమాలో బాహుబలి సినిమాలో కాలకేయుడిగా నటించిన నటుడు ప్రభాకర్ లీడ్ రోల్ చేస్తున్నాడు. ఈ సినిమాకు ఎస్.జె చైతన్య దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలో ఈ సినిమా విడుదల కాబోతోంది. అదిరిపోయే టైటిల్ తో ఈ సినిమా సర్వత్రా హాట్ టాపిక్ అవుతోంది.
రెడ్ కార్పెట్ రీల్స్ బేనర్లో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సోషల్ మీడియాలో ఈ సినిమా పోస్టర్ హల్ చల్ చేస్తోంది.మొత్తానికి ఈ సినిమా ద్వారా ప్రభాకర్ హీరో అయ్యాడన్నమాట. సినిమాకు వెరైటీ టైటిల్ ఉండటంతో అందరినీ ఆకట్టుకుంటోంది. మరి ప్రభాస్ కు అంతా ఆల్ ది బెస్ట్ చెబుదాం...


Click it and Unblock the Notifications











