»   »  'రక్ష' చిత్రం భయపెట్టలేదనే ...రామ్ గోపాల్ వర్మ

'రక్ష' చిత్రం భయపెట్టలేదనే ...రామ్ గోపాల్ వర్మ

Posted By:
Subscribe to Filmibeat Telugu

'ఆమధ్య నేను రూపొందించిన 'రక్ష' ప్రేక్షకులను అనుకున్నంతగా భయపెట్టలేదన్న వాదన ఉంది. ఆ లోటును పూడ్చుకోవడానికి రూపొందిస్తున్న చిత్రమే 'ఆవహం'. ఈ చిత్రం అందర్నీ భయపెడుతుంది' అంటున్నారు రామ్‌గోపాల్‌వర్మ. అలాగే 'ఆవహం' చిత్రం కథ దర్శకుడు నేరేట్ చేస్తున్నప్పుడే తనను భయపెట్టిందని, అది ప్రేక్షకులు కూడా ఫీలవుతారని భావిస్తున్నానని అన్నారు. తెలుగులో రక్ష చిత్రాన్ని వంశీకృష్ణ డైరక్ట్ చేసారు. యండమూరి తులసీ దళం ఆదారంగా ఆ చిత్రం రూపొందినట్లు ప్రచారం చేసారు.

ఆయన సమర్పణలో మిలింద్ గడాక్కర్ దర్శకత్వంలో సార్థక్ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, జడ్ త్రీ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న 'ఆవహం' చిత్రం ఏప్రిల్ 9న విడుదల కానుంది. సుదీప్, అమృత కన్విల్కర్, ఎహసాస్ చన్నా, రిషబ్ జైన్, అను అన్సారీ, గణేష్‌ యాదవ్ ఈ చిత్రంలోని ప్రధాన తారాగణం. ఇక ఈ చిత్రం హిందీలో ఫూంక్ 2 గానూ, తమిళంలో బొమ్మై 2 టైటిల్ తో, తెలుగులో ఆవాహం గా ఒకే రోజు రిలీజ్ చేస్తున్నారు. అత్యధిక ప్రింట్లతో ఈ చిత్రం విడుదల చేయాలని వర్మ భావిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X