ప్రెట్టీ ఉమెన్ చిత్రం స్పూర్తితో... : వరణ్ సందేశ్

By Srikanya

హైదరాబాద్ : వరుణ్‌సందేశ్ హీరోగా నటించిన 'అబ్బాయి క్లాస్ - అమ్మాయి మాస్' చిత్రం షూటింగ్ పూర్తైంది. ఈ చిత్రం ఆగస్ట్ 2న విడుదల కానుంది. లక్ష్మణ్ సినీ విజన్స్ నిర్మిస్తోంది. కోనేటి శ్రీను దర్శకుడు. లక్ష్మణ్ క్యాదారి నిర్మాత. వరుణ్‌సందేశ్, హరిప్రియ జంటగానటించారు.

ఈ చిత్రం గురించి వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.... "ప్రెట్టీ ఉమెన్ స్ఫూర్తితో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రానికి హరిప్రియ హీరో'' అని వరుణ్‌సందేశ్ అన్నారు. "ప్రెట్టీ ఉమెన్ చూస్తుండగా ఈ సినిమాకు కాన్సెప్ట్ తట్టింది. మా టీమ్ నాకు ఎంతగానో సహకరించింది. హరి ప్రియ బోల్డ్ పాత్రలో చాలా బాగా నటించింది'' అని దర్శకుడు చెప్పారు.

" సినిమా చాలా బాగా వచ్చింది. ఆగస్ట్ 2న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని నిర్మాత చెప్పారు. సినిమా పెద్ద విజయం సాధించాలని బెక్కం వేణుగోపాల్ అభిలషించారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కౌషన్ మహ్మద్ సిద్దిఖి, లైన్ ప్రొడ్యూసర్: అనిల్ కుమార్.ఎమ్., సహ నిర్మాతలు: శేఖర్ క్యాదారి, కె.వి.ఆర్. కుమార్ (రఘు).

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X