»   » వేశ్య పాత్రలో మెప్పిస్తోంది

వేశ్య పాత్రలో మెప్పిస్తోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మంచి సినిమా రూపొందించాలని కొందరు అనుకుంటారు. అందరినీ మెప్పించే సినిమా తీయాలని మరికొందరు అనుకుంటారు. నేను మాత్రం మనసుకు నచ్చే సినిమా తీయాలనుకున్నాను. అలా చేసిందే ఈ సినిమా అన్నారు కోనేటి శ్రీను. ఆయన దర్శకత్వంలో రూపొందించిన చిత్రం 'అబ్బాయి క్లాస్‌ అమ్మాయి మాస్‌'. వరుణ్‌ సందేశ్‌, హరిప్రియ ప్రధాన పాత్రల్లో నటించారు. లక్ష్మణ్‌ నిర్మాత. ఈ సినిమా ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర బృందం మీడియాతో మాట్లాడింది.

దర్శకుడు మాట్లాడుతూ... 'వేశ్య పాత్రలో హరిప్రియ నటన సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తోంది. వరుణ్‌సందేశ్ గత చిత్రాలకంటే భిన్నమైన పాత్రలో నటించారు. చక్కటి హాస్యంతో పాటు కథలోని సున్నితమైన భావోద్వేగాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. శేఖర్‌చంద్ర సంగీతం వినసొంపైన బాణీలతో అలరిస్తోంది. ఈ చిత్రం యువతతో పాటు కుటుంబవూపేక్షకుల ఆదరణ పొందడం ఆనందంగా వుంది' అన్నారు.

''నేను చేసిన వాటిల్లో ఈ సినిమాకి ప్రత్యేక స్థానముంది. ఆద్యంతం అలరించే ప్రేమకథా చిత్రాన్ని మా దర్శకుడు అందించారు''అన్నారు వరుణ్‌ సందేశ్‌. హరిప్రియ మాట్లాడుతూ ''అశ్లీలతకు చోటు లేకుండా చక్కని కథనంతో సినిమా సాగింది. నా పాత్రని తీర్చిదిద్దిన విధానం అందరికీ నచ్చుతోంద''న్నారు. ''ఆకట్టుకునే కథ.. అలరించే కథనం.. హీరో,హీరోయిన్స్ నటన కలిస్తే మా సినిమా. హీరోహీరోయిన్ల మధ్య వచ్చిన సన్నివేశాలకు స్పందన బాగుంది''అన్నారు నిర్మాత.

హాలీవుడ్ చిత్రం ప్రెట్టీ వుమెన్ స్పూర్తితో వచ్చిన ఈ చిత్రం ఓ వేశ్యకి, హీరోకి మధ్య జరగే కథగా సాగుతుంది. హీరోయిన్ కాస్త హుషారుగా సీన్స్ ని పరుగెత్తించే ప్రయత్నమైతే చేసింది కానీ...హీరో అదే డల్ ఫేస్ తో రొటీన్ ఎక్సప్రెషన్ తో వచ్చి రాని తెలుగుతో...అసలు ఆకట్టుకోలేకపోయాడు. దర్శకుడు సైతం కథ,దర్శకత్వం రెండు విషయాల్లోనూ దారుణంగా ఫెయిలయ్యాడు. ఎక్కడా కథకు అవసరమైన ఫీల్ వర్కవుట్ చెయ్యలేకపోయాడు. మిగతా డిపార్టమెంట్ లు దానికి తగినట్లే సాగాయి..

English summary
Varun Sandesh Abbai Class Ammayi Mass (ACAM) relesed with negitive talk. Directed by Koneti Srinu, the movie has a cliched storyline.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu