twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా నిజాలు చెప్పాల్సిన అవసరం ఉంది: త్రివిక్రమ్

    |

    'బొమ్మరిల్లు' సినిమాలో... 'ఇప్పటికీ నా చేతులు మీ చేతుల్లోనే ఉన్నాయి నాన్న' అంటూ హీరో చెప్పే డైలాగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బొమ్మరిల్లుతో పాటు అతిథి, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, కిక్, మిస్టర్ పర్ఫెక్ట్, పంజా, ఎవడు, కేరింత, చీకటి రాజ్యం, ఊపిరి, గూఢచారి తదితర చిత్రాలకు అద్భుతమైన డైలాగ్స్ రాసిన అబ్బూరి రవి ఉత్తమ రచయితగా నంది అవార్డు సైతం అందుకున్నారు. రచయితగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రవి... 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' మూవీ ద్వారా నటుడిగా పరిచయం అవుతున్నారు.

    సాయి కిరణ్ అడవి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అబ్బూరి రవి ఘాజీ బాబా అనే టెర్రరిస్ట్ పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ శుక్రవారం లాంచ్ చేశారు. ఈ సందర్భంగా తన స్నేహితుడి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    మంచి తనం ముసుగువెనక ఉన్న..

    మంచి తనం ముసుగువెనక ఉన్న..

    అబ్బూరి రవిని విలన్‌గా పరిచయం చేయడం చాలా సంతోషంగా ఉంది. అతడిలో ఉన్న రియల్ లైఫ్ విలన్ క్యారెక్టర్ సాయి కిరణ్ పట్టుకుని దాన్ని ఎలా తెరకెక్కించారో చూడాలి. మంచి తనం ముసుగు వెనక ఉన్న ఒక తీవ్రవాదిని జనం మధ్యలోకి తీసుకొచ్చారు అంటూ త్రివిక్రమ్ తన స్నేహితుడి గురించి జోక్ చేశారు. అబ్బూరి రవి.. నేను కలిసి చదువుకున్నాం. నాకు ఇష్టమైన స్నేహితుడని తెలిపారు.

    వారి నిజమైన కథ చెప్పడం అభినందనీయం

    వారి నిజమైన కథ చెప్పడం అభినందనీయం

    సాయి కిరణ్ కాశ్మీరీ పండిత్ కథ రాస్తున్నట్లు ఐదారు నెలల క్రితం అబ్బూ నాతో చెప్పారు. నిజమైన పండిత్ కుటుంబాల దగ్గరకు వెళ్లి వారితో ఇంటర్వ్యూలు చేసి, వారి తాలూకు నిజమైన బాధలను, కష్టాలను తెరకెక్కించే ప్రయత్నం చేయడం అభినందనీయమని త్రివిక్రమ్ చెప్పుకొచ్చారు.

    ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా నిజాలు చెప్పాల్సిన అవసరం ఉంది

    ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా నిజాలు చెప్పాల్సిన అవసరం ఉంది

    ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా నిజాలు మనం జనాలకు చెప్పాల్సిన అవసరం ఉంది. సినిమా కేవలం ఎంటర్టెన్మెంట్ కోసం కాకుండా ఏదైనా బలమైన భావాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలనే ప్రతి ప్రయత్నం సక్సెస్ అయి తీరాలి. ఈ సినిమా మంచి విజయం సాధించాల్సిన అవసరం ఉంది అన్నారు.

    త్రివిక్రమ్ లేకుండా నా కెరీర్ లేదు

    త్రివిక్రమ్ లేకుండా నా కెరీర్ లేదు

    అబ్బూరి రవి మాట్లాడుతూ.. ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్' మూవీలో నా లుక్ త్రివిక్రమ్ లాంచ్ చేయడం హ్యాపీగా ఉంది. నన్ను రైటర్‌గా లాంచ్ చేసింది, సినిమాకు పరిచయం చేసింది, ఇపుడు ఆర్టిస్టుగా పరిచయం చేస్తుంది తనే. త్రివిక్రమ్ లేకుండా నా కెరీర్ గురించి మాట్లాడటం జరిగేపని కాదు. నా ప్రతి నిర్ణయంలోనూ నా స్నేహితుడు సలహా ఉంటుంది.' అన్నారు.

    ఆపరేషన్ గోల్డ్ ఫిష్

    ఆపరేషన్ గోల్డ్ ఫిష్

    ఆది సాయికుమార్‌, శ‌షా చెత్రి, కార్తీక్ రాజు, పార్వ‌తీశం, నిత్యా న‌రేశ్, మ‌నోజ్ నందం, కృష్ణుడు, అబ్బూరి ర‌వి, అనీశ్ కురువిల్లా, రామ‌జోగ‌య్య‌శాస్త్రి , రావు ర‌మేశ్‌ కీల‌క పాత్ర‌ధారులు పోషిస్తున్నారు.

    English summary
    Abburi Ravi as Ghazi Baba in 'Operation Gold Fish'. Abburi Ravi will be seen as a terrorist named Ghazi Baba. His first look in the movie has been unveiled by Trivikram Srinivas.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X