»   » నిన్ను తీసేస్తున్నాం...! బాలీవుడ్ సింగర్ నోటి దూలకు ట్విట్టర్ రివర్స్ పంచ్

నిన్ను తీసేస్తున్నాం...! బాలీవుడ్ సింగర్ నోటి దూలకు ట్విట్టర్ రివర్స్ పంచ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

నోటి దూల ఉంటే ఇలాగే ఉంటుంది.... డబ్బుందన్న గర్వం తో ఇష్టం వచ్చినట్టు నోరూ..., కీ బోర్డూ పారేసుకుంటే చిక్కులు తప్పవు. "ఫుట్ పాత్ లపై పడుకున్న కుక్కలు ప్రమాదంలో చనిపోతే కేసులు పెడతామా? ఫుట్ పాత్ లను నిద్రపోయేందుకు ఉపయోగిస్తారా? ఫుట్ పాత్ లపై ప్రమాదాలు జరిగితే డ్రైవర్లది తప్పుకాదు"... అంటూ ఒక సారి సల్మాన్ హిట్ అండ్ రన్ కేసులో శిక్ష పడ్డఫ్ఫుడు ట్వీట్ చేసి ఒక సారి చిక్కుల్లో పడ్డా, మీడియాముందు క్షమాపణలు అడిగినా ఇంకా గాయకుడు అభిజిత్ భట్టాచార్య కి ఙ్ఞాన జ్యోతి వెలగనట్టే కనిపిస్తోంది.

డబ్బున్న వాళ్ళు మాత్రమే

డబ్బున్న వాళ్ళు మాత్రమే

ఈ గాయకుడికి డబ్బున్నవాళ్ళన్నా.., అధికార పార్టి అన్నా వల్ల మాలిన అభిమానం. తాను హిందూ సపోర్టర్ ని అనే చెప్పుకునే ఈయనకి అక్కడ కూడా డబ్బున్న వాళ్ళు మాత్రమే నచ్చుతారు. ఎన్నో సార్లు వివాదాస్పద ట్వీట్ లు చేసిన ఈ విద్వేశ గాయకుడి పై ట్విట్టర్ పంచ్ విసిరింది....

ట్విట్టర్‌ ఖాతాను రద్దు చేసింది

ట్విట్టర్‌ ఖాతాను రద్దు చేసింది

మహిళల పట్ల అభ్యంతరకరమైన ట్వీట్లు చేయడంతో ఆయన ట్విట్టర్‌ ఖాతాను రద్దు చేసింది. అనుచితమైన, అవమానకరమైన భాషను వాడుతున్నందుకే ఇతని ఖాతాను రద్దు చేశామని ఆయన పేజీలో ట్విట్టర్‌ పేర్కొంది. చెన్నైలో జ‌రిగిన టెకీ మ‌ర్డ‌ర్‌పై అభిజీత్ చేసిన కామెంట్స్‌ను ఈ ఇద్ద‌రు జ‌ర్న‌లిస్ట్‌లు తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు.

ల‌వ్ జిహాద్ ఫ‌లిత‌మే

ల‌వ్ జిహాద్ ఫ‌లిత‌మే

ల‌వ్ జిహాద్ ఫ‌లిత‌మే ఆ టెకీ మ‌ర్డ‌ర్ అని అభిజీత్ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు. దీనిపై స్పందించిన స్వాతి.. హ‌త్య‌చేసిన వ్య‌క్తి రామ్‌కుమార్ అని, అత‌న్ని ఇప్పటికే అరెస్ట్ చేసిన‌ట్లు ట్వీట్ చేసింది. ఇలాంటి వ్యాఖ్య‌లు చేసి అభిజీత్ మ‌త ఘ‌ర్ష‌ణ‌ల‌ను ప్రోత్స‌హిస్తున్నాడ‌ని ఆమె ఆరోపించింది.

పాకిస్తాన్ సింగ‌ర్లంటే అత‌నికి ఈర్శ్య

పాకిస్తాన్ సింగ‌ర్లంటే అత‌నికి ఈర్శ్య

అంతేకాదు పాకిస్తాన్ సింగ‌ర్లంటే అత‌నికి ఈర్శ్య అని, వారి వ‌ల్లే అత‌ని కెరీర్ దెబ్బ‌తిన్న‌ద‌ని ఫీల‌వుతుంటాడ‌ని కూడా ఆమె ట్వీట్ చేసింది. దీనిపై తీవ్రంగా స్పందించిన అభిజీత్ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్లో ఆమెను ఉద్దేశించి అస‌భ్య ప‌ద‌జాలంతో ఓ ట్వీట్ పోస్ట్ చేయ‌డం వివాదానికి కార‌ణ‌మైంది.

అద్నాన్ సమీ వల్ల

అద్నాన్ సమీ వల్ల

నిజానికి అభిజీత్ అనే ఈ గాయకుడి కెరీర్ పాకిస్థానీ జాతీయుడైన అద్నాన్ సమీ వల్ల దెబ్బతిన్న మాట నిజమే.., తాను పాడే పాటలు సక్సెస్ కాకపోవటానికి అద్నాన్, మరికొందరు పాకిస్థానీ గాయకులే కారణం అన్న విద్వేషం తో చాలాసార్లు నోటికొచ్చినట్టు మాట్లాడిన సంగతి బాలీవుడ్ మొత్తానికీ తెలుసు. ఆ విషయాన్ని గుర్తు చేయటం తో ‘ఆమె రెండుగంటల కోసం డబ్బులు తీసుకొని.. క్లయింట్‌కు సంతృప్తినివ్వలేదన్న రూమర్‌ ఉంది' అంటూ వెకిలి కామెంట్లు చేశాడు.

రెచ్చగొట్టే, విద్వేషపూరిత ట్వీట్లు

రెచ్చగొట్టే, విద్వేషపూరిత ట్వీట్లు

మహిళా జర్నలిస్ట్‌ స్వాతి చతుర్వేదిని ఉద్దేశించి రెచ్చగొట్టే, విద్వేషపూరిత ట్వీట్లు చేయడంతో గత ఏడాది అభిజీత్‌ పై సోషల్‌ మీడియాలో ఆగ్రహం వ్యక్తమైంది. దీనిపై ఆమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆయనను అరెస్టు చేసి లోపలేశారు. ఆ కోపంతోనే బెయిల్‌ మీద బయటికి వచ్చీ రావటం తోనే మళ్ళీ పాతతరహా ట్వీట్లు మొదలూ పెట్టాడు.

నీచమైన కామెంట్లు

నీచమైన కామెంట్లు

ఇటీవల జేఎన్‌యూ విద్యార్థిని, హక్కుల కార్యకర్త షెహ్లా రషీద్‌ పట్ల పలు అభ్యంతరకరమైన ట్వీట్లు చేశాడు. పలువురు ఇతర మహిళా నెటిజన్లపైనా ఆయన ఇదేవిధంగా నీచమైన కామెంట్లు చేశాడు. దీనిపై నెటిజన్లు ఫిర్యాదు చేయడంతో ఇతగాడి పేజీని ట్విట్టర్‌ రద్దు చేసింది.

English summary
Abhijeet Bhattacharya's Twitter account was suspended after he posted a series of 'offensive tweets', especially against women
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu