Don't Miss!
- Finance
Stock Market: వచ్చే వారం మార్కెట్లు ఎలా ఉంటాయ్..? ట్రేడర్స్ గుర్తించాల్సిన విషయాలు..
- Lifestyle
Chanakya Niti: చాణక్యుడు చెప్పినట్లు ఇలా చేస్తే విజయం దాసోహం అంటుంది
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- News
Wife: నువ్వు ఎంజాయ్ చెయ్యడానికి నా భార్య కావాలా ?, నువ్వు అంత మగాడివా రా ?, ఇద్దరూ క్రిమినల్స్!
- Sports
INDvsNZ : ఓపెనింగ్.. ఫినిషింగ్.. రెండూ టీమిండియాకు సమస్యలే!
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
సక్సెస్ ఫుల్ యంగ్ డైరెక్టర్‌తో అభిజిత్.. వామ్మో రచ్చ మామూలుగా లేదుగా!
బిగ్ బాస్ షో నాల్గో సీజన్ ముగిసింది. కానీ కంటెస్టెంట్ల రచ్చ మాత్రం తగ్గడం లేదు. రోజూ ఎవరో ఒకరు వార్తల్లో నిలుస్తున్నారు. కాంట్రవర్సీలు చేస్తూ కొందరు.. మీడియాలో ఇంటర్వ్యూలు ఇస్తూ, కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. మరి కొందరు షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. ఇంకొందరు సోషల్ మీడియాలో లైవ్‌లు పెడుతూ హల్చల్ చేస్తున్నారు. ఇందులో మూవీ అప్డేట్లు ఇస్తూ సోహెల్ ముందు వరుసలో ఉన్నాడు.

పుల్ జోష్‌లో సోహెల్..
నాల్గో సీజన్ కంటెస్టెంట్లలో సోహెల్ ముందు వరుసలో ఉన్నాడు. అందరి కంటే ముందుగా సినిమాను ప్రకటించి ఆశ్చర్యపరిచాడు. జార్జిరెడ్డి ఫేమ్ అప్పి రెడ్డి నిర్మాతగా సోహెల్ తన కొత్త సినిమాను ప్రకటించాడు. అలా అందరి కంటే ముందు ప్రకటించి అభిమానులను ఖుషీ చేశాడు.

అభిజిత్ కూడా..
అయితే సోహెల్ కంటే ముందుగానే అభిజిత్‌కు చాలా ఆఫర్లు వచ్చాయని తెలుస్తోంది. కానీ అప్డేట్ ఇచ్చేందుకు మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నాడని టాక్. ఇప్పటికే అభిజిత్ ఖాతాలో మూడు ప్రాజెక్ట్‌లు రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. పైగా అభిజిత్ వెబ్ సిరీస్‌లపైనా శ్రద్ద పెట్టినట్టు చెప్పుకొచ్చాడు.

నెటిజన్లతో..
రెండ్రోజుల క్రితం అభిజిత్ తన అభిమానులతో ముచ్చట్లు పెట్టాడు. ట్విట్టర్‌లో లైవ్ సెషన్‌లో పాల్గొన్నాడు. అందులో నెటిజన్లు తన భవిష్యత్తు ప్రాజెక్ట్‌ల గురించి వివరాలు అడిగారు. అదిరిపోయే సర్ ప్రైజ్ త్వరలోనే రానుందని కామెంట్ పెట్టాడు. దీంతో అభిజిత్ భారీ ప్లాన్లు వేశాడని అర్థమైంది.

వెంకీ కుడుములతో..
తాజాగా అభిజిత్ వెంకీ కుడుములతో కలిశాడు. ఇద్దరూ కలిసి బాగానే ముచ్చటించుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సినిమా చర్చలు జరిగాయా? అని అభిమానులు ఆసక్తిని కనబరుస్తున్నారు. మొత్తానికి ఇలా ఫోటోను పెట్టి ఎన్నో అనుమానాలు వచ్చేలా చేశాడు.

చాలా రోజులైంది..
ఛలో, భీష్మ వంటి సక్సెస్‌ల మీదున్న వెంకీ కుడుముల అభిజిత్ ఇద్దరూ స్నేహితులని తెలుస్తోంది. ఈ మీటింగ్ అనంతరం అభిజిత్ చేసిన కామెంట్లు చూస్తుంటే ఈ ఇద్దరి మధ్య మంచి స్నేహ బంధం ఉందని అర్థమవుతోంది. ఈ మధ్యాహ్నం అంతా సరదాగా గడిచిపోయింది.. వెంకీ కుడుములతో ఉన్న నాటి రోజులు ఎంతో మిస్ అవుతున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.