Don't Miss!
- News
Wife: నువ్వు ఎంజాయ్ చెయ్యడానికి నా భార్య కావాలా ?, నువ్వు అంత మగాడివా రా ?, ఇద్దరూ క్రిమినల్స్!
- Finance
Holidays in February: ఫిబ్రవరిలో 10 రోజులు బ్యాంక్స్ క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..?
- Sports
INDvsNZ : ఓపెనింగ్.. ఫినిషింగ్.. రెండూ టీమిండియాకు సమస్యలే!
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
ప్రొడ్యూసర్ గానూ సూపర్ సక్సెస్ అందుకున్న అభినవ్ సర్దార్
రామ్ అసుర్ సినిమాతో హీరోగానూ, ప్రొడ్యూసర్ గానూ సూపర్ సక్సెస్ అందుకున్న అభినవ్ సర్దార్ బ్యాక్ టు బ్యాక్ బాక్సాఫీస్ పై దండయాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. తన స్వీయ నిర్మాణంలోనే తెరకెక్కించిన మిస్టేక్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని మొదటి పాట విడుదలై యూట్యూబ్ ను షేక్ చేసేస్తోంది. మంగ్లీ, రోల్ రైడా ఆలపించిన పాట మిలియన్ వ్యూస్ తో శ్రోతలను ఆకట్టుకుంటోంది.

ఇప్పుడు ఇదే సినిమాలో రెండవ పాట విడుదలకు సిద్ధమవుతోంది. బుధవారం గుంటూరులోని VVIT కళాశాలలో సుమారు 4వేల మంది విద్యార్ధుల చేత ఈ పాటను విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే టకీర మోచో సాంగ్ ప్రోమో విడుదలవ్వగా... ఆబాలగోపాలాన్నీ ఉర్రూతలూగిస్తోందనే చెప్పాలి.ఈ పాట కోసం సుమారు 40మంది లిల్లీపుట్స్ ను సేకరించినట్లు తెలుస్తోంది. జంగిల్ థీమ్ తో ఆకట్టుకుంటోన్న ఈ పాట, ప్రోమోనే ఈ రేంజ్ లో ఉంటే... ఇక ఫుల్ సాంగ్ ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్ధం చేసుకోవచ్చు. అభినవ్ సర్దార్ కీలక పాత్రలో కనిపించబోతున్న ఈ చిత్రానికి సన్నీ కోమలపాటి దర్శకత్వం వహించారు. త్వరలోనే సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేయనున్నారు.