»   » మోస పోయిందా? అయినా తమన్నా ఇరగదీసిందే! (అభినేత్రి మూవీ టీజర్)

మోస పోయిందా? అయినా తమన్నా ఇరగదీసిందే! (అభినేత్రి మూవీ టీజర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రభుదేవా, తమన్నా, సోనూసూద్ లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా అభినేత్రి. ఈ సినిమాకు తమిళ దర్శకుడు ఎఎల్.విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను మూడు భాషల్లో వేర్వేరు టైటిల్స్ తో రిలీజ్ చేయబోతున్నారు.

ఈ చిత్రానికి తెలుగులో 'అభినేత్రి' అనే టైటిల్ ఫిక్స్ చేయగా... తమిళంలో 'డెవిల్' పేరుతో, హిందీలో 'టూ ఇన్ వన్' పేరుతో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా తమన్నాతో ఓ టీజర్ రిలీజ్ చేసారు. ఇందులో తమన్నా తన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఇరగదీసింది.


మరి ప్రభుదేవాతో కలిసి సినిమా అంటే ఆ మాత్రం డాన్స్ టాలెంట్ ప్రదర్శించక పోతే ఎట్టా? తమన్నా ఈ సినిమాలో తన డాన్సింగ్ స్కిల్స్ ను ఓ రేంజిలో ప్రదర్శించబోతోందని స్పష్టమవుతోంది. స్లైడ్ షోలో అందుకు సంబంధించిన టీజర్ ను మీరు చూడొచ్చు.


సినిమాకు సంబంధించిన వివరాల్లోకి వెళితే....తెలుగు వెర్షన్ 'అభినేత్రి'కి ప్రముఖ రచయిత కోన వెంకట్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, తమిళ వర్షన్ ను ప్రభుదేవా, హిందీ వర్షన్ ను సోనూసూద్ లు నిర్మిస్తున్నారు.


స్లైడ్ షోలో తమన్నా డాన్స్ పెర్ఫార్మెన్స్ కు సంబంధించిన టీజర్ తో పాటు.... తమన్నా మోస పోయినట్లు ప్రచారంలో వచ్చిన రూమర్స్ కమామిషు...


తమన్నా

ఈ వీడియోలో తమన్నా డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇరగ దీసింది కదూ....


అయ్యో అంతేనా?

అయ్యో అంతేనా?

ఈ సినిమా మూడు బాషల్లో వస్తున్నా తమన్నాకు మాత్రం కేవలం 30 లక్షలు రెమ్యూనరేషన్ దక్కిందట.


మోస పోయిందా?

మోస పోయిందా?

తమన్నాతో అగ్రిమెంటు తర్వాతే మూడు బాషల్లో సినిమా రిలీజ్ అని చెప్పారట. ఆమెకు ముందే విషయం చెప్పి ఉంటే ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసేదని, రెమ్యూనరేషన్ విషయంలో ఆమె మోస పోయిందని అంటున్నారు.


తిరగాలి..

తిరగాలి..

తీసుకున్నది 30 లక్షలే అయినా... అగ్రిమెంటు ప్రకారం ఆమె మూడు బాషల్లో ప్రమోషన్లు చేయాల్సి ఉంటుందట.


ఒకప్పుడు..

ఒకప్పుడు..

ఒకప్పుడు తమన్నా తన సినిమా ఇతర బాషల్లో రిలీజ్ అయితే... ప్రమోషన్స్ చేయడానికే రూ. 10 లక్షలు ఎక్స్ ట్రా వసూలు చేసేదట.


అయినా ఇరగదీసింది

అయినా ఇరగదీసింది

ప్రస్తుతం తమన్నా రెమ్యూనరేషన్ గురించి ఆలోచించడం లేదని, ఈ సినిమా హిట్ కావాలనే తన టాలెంటును పూర్తి స్థాయిలో ప్రదర్శిస్తోందని అంటున్నారు. ప్రస్తుతం ఆమె ఉన్న పరిస్థితుల్లో రెమ్యూనరేషన్ కంటే హిట్టు దక్కడమే ముఖ్యమని భావిస్తోందట.


English summary
Tamannah Bhatia Performs Her Best Dance Moves Under The Supervision Of Prabhu Deva. Abhinetri is a Trilingual Indian film made simultaneously as Abhinetri in Telugu, 2 in 1 in Hindi and Devil in Tamil. Presented by Kona Film Corporation in association with Blue Circle Corporation & BLN Cinema.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu