»   » రానా తమ్ముడు హీరోగా "జతొజడ మీద జమజచ్చ" కి సీక్వెల్

రానా తమ్ముడు హీరోగా "జతొజడ మీద జమజచ్చ" కి సీక్వెల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

డైరెక్టర్ వంశీని మరోమెట్టుకు తీసుకెళ్లిన చిత్రం లేడీస్ టైలర్. రాజేంద్రప్రసాద్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా నిలచిన ఈ మూవీ.. ఆ ఏడాది హిట్ సినిమాల్లో ఒకటిగా నిలచింది. రాజేంద్రుడికి కామెడీ హీరోగా స్టార్ ఇమేజ్ ను కట్టబెట్టింది. ఇక ఈ సినిమా అంతా మచ్చ ఉన్న అమ్మాయి కోసం వెతికే టైలర్ గా రాజేంద్రప్రసాద్ చేసిన చిలిపి చేష్టలు ఇప్పటికీ గిలిగింతలు పెట్టిస్తాయి. 1985లో సందడి చేసిన ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు వంశీ.

అయితే తండ్రి మచ్చకోసం వెతికినట్లు.. కొడుకు దేనికోసం వెతక బోతున్నాడన్నదే ఇప్పుడు ఫిలింనగర్ లో హాట్ టాపిక్.... మచ్చ కనుక్కునే ప్రయత్నంలో అమ్మాయిలకు స్పెషల్ కాస్ట్యూమ్స్ డిజైన్ చేశాడు లేడీస్ టైలర్. ఇప్పటి కాలంలో అది వర్కౌట్ కాదు... ఎందుకంటే ఇప్పుడున్న హీరోయిన్లతో పాటు జనాలు కూడా మినీ స్కర్ట్ లు, స్లీవ్ లెస్ లు వేసుకుంటారు..

Abhiram Daggubati Debut In Ladies Tailor Sequel

మొదట్లో రాజ్ తరుణ్ హీరో అనుకున్నారు కానీ తెరవెనుక ఏమైందో మరి రాజ్ తరుణ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించబడ్డాడు. తనే తప్పుకున్నాడు అని కూడా అన్నారు. రాజ్ కంటే ముందు కొన్నాళ్ళు రవితేజ పేరుకూడా వినిపించింది. కానీ సినిమా మళ్ళీ మళ్ళీ వాయిదా పడుతూనే వస్తోంది. సరైన నిర్మాత దొరకక ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. ఫైనల్ గా ఈ సినిమా రీమేక్ త్వరలోనే సెట్స్ పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని ఇటీవలే నిహారికతో 'ఒక మనసు' చిత్రాన్ని నిర్మించిన మధుర శ్రీధర్ నిర్మిస్తున్నారు. ఇంకా ఆసక్తి కరమైన సంగతేంటంటే.. ఈ సినిమాలో హీరోగా దగ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్ నటించనున్నాడు.

వచ్చే నెల నుండి సెట్స్ మీదికెళ్ళనన్న ఈ సినిమాకి 'ఫ్యాషన్ డిజైనర్ S/O లేడీస్ టైలర్' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. మధుర శ్రీధర్ నిర్మించనున్న ఈ సినిమాలో మరో ఇద్దరు కథానాయకులకి ప్రాధాన్యం ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల నటుడు, దర్శకుడు అయిన శ్రీనివాస్ అవసరాల కుట్టు మిషన్‌తో ఉన్న ఓ ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ 'జటై.. జైలర్' అని రాసుకొచ్చాడు. ఈ వ్యవహారం చూస్తోంటే అతడూ ఈ సినిమాలో భాగం కానున్నట్టు అవగతమవుతోంది.

English summary
Rana's brother Daggubati Abhiram who is going to make his Telugu debut. He is wanting to join hands with Vamsi for the upcoming venture Fashion Designer S/O Ladies Tailor
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu