»   »  పవన్ కళ్యాణ్‌కు నేను పెద్ద అభిమానిని: అభిషేక్ బచ్చన్

పవన్ కళ్యాణ్‌కు నేను పెద్ద అభిమానిని: అభిషేక్ బచ్చన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఆసక్తికర ప్రకటన చేసారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు తాను పెద్ద అభిమానిని అంటూ పేర్కొన్నారు. ప్రోకబడ్డీ లీగ్ లో ‘జైపూర్ పింక్ పాంథర్స్' ఫ్రాంచైజీ యజమానిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

 Abhishek Bachchan about Pawan Kalyan

తమ జట్టు మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్ వచ్చిన ఆయన మాట్లాడుతూ...మెగా ఫ్యామిలీతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంతో ఇష్టం. పవన్ కళ్యాణ్ కు పెద్ద అభిమానిని. ఆయన సినిమాలు మిస్ కాకుండా చూస్తుంటాను. మంచి పాత్ర వస్తే టాలీవుడ్ సినిమాల్లో నటించడానికి సిద్దమే అని అభిషేక్ బచ్చన్ పేర్కొన్నారు.

హైదరాబాద్ చాలా బావుందని, ఇక్కడి వాతావరణం నాకు చాలా బాగా నచ్చిందని, కబడ్డీకి సపోర్టు ఇవ్వడంలో భాగంగా ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది అంటూ అభిషేక్ బచ్చన్ ట్వీట్ చేసారు. జూనియర్ బచ్చన్ పవన్ కళ్యాణ్ గురించి ఇలా మాట్లాడటంపై మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

English summary
Abhishek Bachchan recalled his association with Mega Family. Apart from saying that he have high regard for Megastar Chiranjeevi, Abhishek claimed that he is a fan of Pawan Kalyan and doesn't miss watching any of his films.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu