»   » మా అమ్మాయి ప్రసక్తి తేవద్దంటూ హీరో...

మా అమ్మాయి ప్రసక్తి తేవద్దంటూ హీరో...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : 'ధూమ్‌ 3' ప్రచారంలో భాగంగా తన కూతురు ఆరాధ్య గురించి ఎవరూ, ఎప్పుడూ ప్రశ్నించవద్దని బాలీవుడ్‌ నటుడు అభిషేక్‌బచ్చన్‌ విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. అభిషేక్‌, అమీర్‌ఖాన్‌ పిల్లల గురించి విలేకరుల సమావేశంలో ప్రశ్నించడంతో ఆ ఇద్దరూ భిన్నరీతిలో స్పందించారు. అమీర్‌ఖాన్‌ తన కుమారుడు ఆజాద్‌ గురించి మాట్లాడేందుకు అంగీకరించినా, అభిషేక్‌ మాత్రం ససేమిరా అన్నాడు.


తన రెండేళ్ల కుమారుడు ఆజాద్‌ ధూమ్‌ మచాలే పాటకు డ్యాన్స్‌ చేస్తాడని అమీర్‌ పేర్కొన్నారు. మరీ మీ పాప ఎలా డ్యాన్స్‌ చేస్తుందని అభిషేక్‌ను అడగ్గానే తన వద్ద ఎప్పుడూ ఆరాధ్య ప్రస్తావన తీసుకురావద్దని మీడియాకు సూచించాడు. దాంతో మీడియావారు షాక్ అయ్యారు. ఎప్పుడు ఆరాధ్య గురించి మాట్లాడినా ఐశ్వర్య,అభిషేక్ చాలా ఆనందంగా మైమరిచిపోయి మీడియావద్ద ఉంటారు..అలాంటిది ఇలా స్పంధించటం వారిని షాక్ కు గురి చేసింది.

ishek Bachchan not interested to talk about Aaradhya

అంతకు ముందు...ధూమ్ 3 షూటింగ్ సమయంలో అమీర్ ఖాన్ తో తమ పాప చాలా సన్నిహితంగా ఉంటుందని అభిషేక్ మీడియాతో అన్నారు. చికాగో సెట్ లో షూటింగ్ జరిగినప్పుడు ఆరాద్య ఎప్పుడూ అమీర్ ఖాన్ తో ఆడుకోవటానికి ఆసక్తి చూపించేదని అన్నారు. చాలా సాయింత్రాలు వాళ్లిద్దరూ ఆడుకుంటూ గడిపారని అన్నారు. అయితే రిలీజయ్యాక..ఆయన చిత్రంలో తన పాత్ర పరిథి తగ్గిందని,తన ప్రాముఖ్యత లేదని ఫీలవుతూ మండిపడుతున్నారు.


ఇక అమీర్‌ఖాన్, కట్రీనా కైఫ్, అభిషేక్ బచ్చన్, ఉదయ్ చోప్రా ప్రధాన పాత్రలు పోషించిన 'ధూమ్ 3' చిత్రం ఈ నెల 20న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల అయ్యింది. విజయ్‌కృష్ణ ఆచార్య దర్శకత్వంలో యశ్‌రాజ్ ఫిలిమ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ చిత్రం నైజాంలో యశ్‌రాజ్ ఫిలిమ్స్ సొంతంగా విడుదల చేయనున్నట్లు సమాచారం. కాగా 'ధూమ్ 3'లో అమీర్, కట్రీనాపై చిత్రీకరించిన ఓ పాటకు నిర్మాతలు రూ. 5 కోట్లు ఖర్చు చెయ్యడం గమనించదగ్గ అంశం.

English summary
Actor Abhishek Bachchan says his one-and half-year-old daughter Aaradhya got pally with co-star Aamir Khan while they were shooting for 'Dhoom 3' in Chicago. Abhishek and Aishwarya Rai's daughter Aaradhya and Aamir and Kiran Rao's son Azad were in Chicago on the sets of 'Dhoom 3', as their fathers were shooting."When we were shooting for 'Dhoom 3', I remember Aaradhya had come on the sets and Aamir Khan spent an entire evening with her. She is very fond of him. She liked him and is also pally with him," Abhishek Bachchan said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu