»   » మెగాస్టార్ ‘మనం’ టైప్ ఫొటో

మెగాస్టార్ ‘మనం’ టైప్ ఫొటో

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: అక్కినేని కుటుంబం అంతా కలిసి ‘మనం' సినిమాలో మెరిసారు. ఆ ప్రేరణో ఏంటో కానీ సెలబ్రెటీలు తమ వంశవృక్షాలను గుర్తు చేస్తూ ఫొటోలను అప్పుడప్పుడూ షేర్ చేస్తున్నారు. ఇప్పుడు అలా అమితాబ్ వంతు వచ్చింది. ఆయనకు ఈ సినిమాపైన కన్ను పడిందో లేదో కానీ ఫొటో మాత్రం డిజైన్ చేసుకున్నారు. మీరు చూస్తున్నది అదే.

Abhishek captures four generations of Bachchans in one frame!

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌ బచ్చన్‌ కుటుంబం గురించి, వంశవృక్షం గురించి ప్రత్యేకంగా గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన కుటుంబం అంతా నటనా రంగంలో ఉండడంతో దేశవ్యాప్తంగా ప్రజల అభిమానాన్ని, అంతులేని అభిమానుల ఆదరాన్ని చూరగొంది.

అయితే ఇక్కడ చెప్పుకోతగ్గ విషయం ...అమితాబ్‌ కన్నా ముందు ఆయన తండ్రి హరివంశ్‌రాయ్‌ బచ్చన్‌ కవిగా ప్రఖ్యాతి గాంచారు. తనదైన పేరు ప్రతిష్ఠలు సంపాదించారు. ఆయనతో మొదలుపెట్టి మునిమనవరాలు ఆరాధ్య బచ్చన్‌ వరకు ఈ కుటుంబసభ్యులకు అభిమానులు చాలామందే ఉంటారు.

Abhishek captures four generations of Bachchans in one frame!

వారిని అలరించడానికా అన్నట్లు అభిషేక్‌ బచ్చన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తమ నాలుగు తరాల ఫొటోను పోస్ట్‌ చేశాడు. ఒకరి తర్వాత ఒకరు తమ వారసుల ఫొటోను పట్టుకున్నట్లు ఉన్న ఈ ఫొటో అభిమానులను ఎంతో ఆకట్టుకుంటోంది. మీకూ ఈ ఫొటో నచ్చే ఉంటుంది.

English summary
Abhishek Bachchan gave his fans an opportunity to witness the four generations of his family in one pic!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu