»   »  ఒక ఐడియా...అతనికి సినిమా ఇప్పించింది

ఒక ఐడియా...అతనికి సినిమా ఇప్పించింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రీమేక్ చేసేటప్పుడు సాధారణంగా కీలకమైన మార్పులు చేయటానికి దర్శక,నిర్మాతలు ధైర్యం చేయరు. కానీ అల్లరి నరేష్ హీరోగా రూపొంది రిలీజ్ కు సిద్దమైన 'జంప్‌ జిలాని' లో మాత్రం భారీ మార్పు చేసారు. తమిళంలో ఇద్దరు హీరోల కథని, తెలుగులో డ్యూయిల్ రోల్ చిత్రంగా రెడీ చేసారు. మరో హీరోని తీసుకురావటం బడ్జెట్ పరంగా ఇబ్బంది అవుతుందనే ఆలోచనతో ఈ పనిచేసినట్లు సినీ వర్గాల్లో వినపడుతోంది. దాంతో అల్లరి నరేష్ చేతే రెండు పాత్రలూ చేయించి హిట్ కొట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ ఐడియాతోనే దర్శకుడు సినిమా ఓకే చేయించుకున్నట్లు చెప్తున్నారు.

దర్శకుడు ఇ.సత్తిబాబు మాట్లాడుతూ... ''తమిళంలో విజయవంతమైన 'కలగలపు' చిత్రానికి రీమేక్‌ ఇది. కానీ మేం మాతృకలో చాలా మార్పులు చేసి ఈ సినిమాని తీశాం. అక్కడ ఇద్దరు హీరోలు నటిస్తే... ఇక్కడ ఆ రెండు పాత్రల్ని అల్లరి నరేషే చేశారు. తను ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఈ సినిమాలో నటించారు. ఇదివరకు ద్విపాత్రాభినయంతో కూడిన సినిమాలు చాలానే వచ్చాయి. వాటికి పూర్తి భిన్నమైన చిత్రమిది. ఇద్దరు నరేష్‌లు ఎప్పుడూ తెరపై కనిపిస్తూనే ఉంటారు. రెండు పాత్రల నేపథ్యంలోనే ఇందులో మూడు పాటలు సాగుతాయి. ఇషాచావ్లా, స్వాతి దీక్షిత్‌ చక్కటి అభినయాన్ని ప్రదర్శించారు''అని తెలిపారు సత్తిబాబు.

About Allari Naresh's Jump Jilani duel role

'జంప్‌ జిలానీ'.. టైటిల్ తో ఇప్పుడు సినిమా వస్తోంది. తొలిసారిగా అల్లరి నరేష్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇషా చావ్లా, స్వాతి దీక్షిత్‌ హీరోయిన్. ఇ.సత్తిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. అంబికా రాజా నిర్మాత. అంబికా కృష్ణ సమర్పకులు. ఈ సినిమా జూన్ 12న విడుదల అవుతోంది. రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై అంబికా కృష్ణ సమర్పణలో వెంకటేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళంలో ఘన విజయం సాధించిన "కలగలుపు'' చిత్రం ఆధారంగా తెలుగులో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.

అంబికా కృష్ణ సినిమా గురించి మాట్లాడుతూ... తమిళంలో హౌస్ ఫుల్ కలెక్షన్లతో ప్రదర్శితమవుతున్న "కలగలుపు'' చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలని ఈ సినిమా రీమేక్ హక్కులు కొన్నాము. ఇదే చిత్రాన్ని యూటీవి మలయాళంలో, హిందీ లో రీమేక్ చేస్తోంది. తమిళంలో అంజలి పోషించిన పాత్రకు ఇషా చావ్లాని ఎంపిక చేశాము. తెలుగు లో కూడా ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం నాకుంది అన్నారు.


అల్లరి నరేష్ మాట్లాడుతూ.... ''సీమశాస్త్రిలోని సుబ్రహ్మణ్యశాస్త్రి పాత్ర 'గమ్యం'లో గాలిశీను కలిపితే ఎలా ఉంటుందో ఈ సినిమాలో నా పాత్ర అలా ఉంటుంది''అన్నారు‌. తమిళంలో 'కలగలప్పు' చిత్రాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేశామన్నారు. హీరోగా ద్విపాత్రాభినయం చేయడం సంతోషంగా ఉందని, నాన్నగారి (ఈవీవీ) 'హలోబ్రదర్' తరహాలో ఒక మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించబోతున్నామని నరేష్ అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ... ''తమిళంలో విజయంవంతమైన 'కలగలుపు' చిత్రానికిది రీమేక్‌. సత్తిబాబు, నరేష్‌ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన సినిమాలన్నీ విజయం సాధించాయి. మా హీరో నటించిన "సుడిగాడు'' చిత్రం తరువాత మళ్ళీ ఈ సినిమాలో రెండు పాత్రలు పోషించారు. దర్శకుడు సత్తిబాబు, నరేష్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ విజయం సాధించాయి. అనుభవమున్న ఆర్టస్టులతో, టాలెంటెడ్ టెక్నీషియన్స్ తో మేం నిర్మిస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకు పూర్తి వినోదాన్ని అందిస్తామని ఖచ్చితంగా ఎప్పగలం. ఈ చిత్రం కూడా అదేస్థాయిలో ప్రేక్షకుల్ని అలరిస్తుందని ఆశిస్తున్నాం'' అన్నారు.

ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, పోసాని కృష్ణమురళి, ఎమ్మెస్‌ నారాయణ, చలపతిరావు తదితరులు ఇతర పాత్రధారులు. సంగీతం: విజయ్‌ ఎబెంజర్‌, ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్ర, కళ: కిరణ్‌కుమార్‌, కూర్పు: గౌతంరాజు.

English summary

 Allari Naresh's 'Jump Jilani' is getting ready to hit the ... Jump Jilani has Allari Naresh in a dual role. This has been directed by E Satti Babu, a protégé of the late E V V Satyanarayana so the comedy dose is going to be high.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu