»   » బాలయ్య...99వ చిత్రం...5 గురు రైటర్స్... 29 నే

బాలయ్య...99వ చిత్రం...5 గురు రైటర్స్... 29 నే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నందమూరి బాలకృష్ణ 98వ చిత్రం 'లయన్‌' గురువారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలకృష్ణ వెంటనే తన 99వ సినిమా సన్నాహాల్లో పడిపోయారు. బాలకృష్ణ కొత్త చిత్రానికి శ్రీవాస్‌ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ తెరకెక్కిస్తోంది. ఈ నెల 29న ఈ చిత్రానికి కొబ్బరికాయ కొట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్టు పక్కాగా సిద్ధమైంది. అలాగే ఈ చిత్రానికి ఐదుగురు రైటర్స్ పనిచేస్తున్నారు.

నందమూరి బాలకృష్ణ ఇమేజ్‌కీ, ఆయన శైలికీ సరిగ్గా సరిపోయే కథ ఇదని దర్శక,నిర్మాతలు చెప్తున్నారు. మరోవైపు హీరోయిన్స్ వేట సాగుతోంది. ఈ చిత్రానికి కోన వెంకట్‌, గోపీమోహన్‌, బీవీఎస్‌ రవి, డైమండ్‌రత్నం, శ్రీధర్‌ సీపాన రచనా సహకారం అందించారు. ఐదుగురు రచయితలు ఓ సినిమా కోసం పనిచేయడం గొప్ప విషయమే. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి 'డిక్టేటర్‌' పేరు పరిశీలనలో ఉంది.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


About Balakrishna's 99th film details

త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్ర్రారంభించి దసరా కానుకగా ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఈ సినిమాని హైదరబాద్, ఢిల్లీ, యూరప్ లలో కంటిన్యూగా షూట్ చేయనున్నారు.


ఈ సినిమాలో బాలకృష్ణ సరసన నయనతారని హీరోయిన్ గా సెలెక్ట్ చేసారు. గతంలో బాలకృష్ణ - నయనతార కాంబినేషన్ లో వచ్చిన ‘సింహా', ‘శ్రీ రామరాజ్యం' పెద్ద హిట్ అయ్యాయి. వీరిద్దరి జోడీలో రానున్న మూడవ సినిమా ఇది.


ఆ మధ్యన బాలకృష్ణ తన కుటుంబంతో కలిసి లౌక్యం చిత్రాన్ని స్పెషల్ షో చూడటం జరిగింది. ఇంప్రెస్ అయిన బాలకృష్ణ ఓ వినోదాత్మకమైన చిత్రం చేయటానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే తన అభిమానులను నిరాశపరచకుండా యాక్షన్ సన్నివేశాలకు కూడా సరైన స్దానం స్క్రిప్టులు ఇవ్వమని కోరినట్లు సమాచారం. ఈ మేరకు స్క్రిప్టులో మార్పులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆ స్క్రిప్టు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.


మరో ప్రక్క అందరూ రామ్ చరణ్ తో శ్రీవాస్ ముందుకు వెళ్తారని భావించారు. అయితే ఈ లోగా బాలకృష్ణ ఈ ఆఫర్ ఇవ్వటంతో ఇటు జంప్ అయినట్లు చెప్పుకుంటున్నారు. పాండవులు పాండవులు తుమ్మెద,లౌక్యం విజయాలతో మినిమం గ్యారెంటీ దర్శకుడుగా అతను టాలీవుడ్ లో సెటిల్ అయినట్లే. బాలకృష్ణతో కూడా అదే మాదిరిగా హిట్ కొడితే అతనికి తిరుగు ఉండదని సినీ వర్గాలు అంటున్నాయి.

English summary
Bala Krishna’s 99th movie has been confirmed in the direction of Sriwass, and Eros International will be producing the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu