»   » బాలయ్య...స్పెషల్ షోలు స్ఫెషల్ గా...

బాలయ్య...స్పెషల్ షోలు స్ఫెషల్ గా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : బాలకృష్ణ ఎమ్.ఎల్.ఎ నెగ్గిన తర్వాత వస్తున్న సినిమా 'డిక్టేటర్' పై మంచి క్రేజ్ ఉంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబందించి బెనిఫిట్ షోలు కన్నా... స్పెషల్ షోలు ఎక్కువ పడనున్నాయి. అందుకుకారణం పొలిటికల్ గా తన మిత్రులైన చాలా మందికోసం కూడా ఈ షో లు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ముఖ్యంగా ఆంధ్రపదేశ్ మరీను. బాలయ్యకు చాలాస్ట్రాగ్ ఉండే ఏరియాలైన ఆంధ్రా, సీడేడ్ లో అయితే ముందు రోజూ రాత్రి, అనగా ఉదయం 12 గంటల నుండి ఉదయం 2 గంటల మద్య షోలు వేస్తారని సమాచారం. మిగిలిన ఏరియాల్లో అనగా నైజాం లాంటి చోట్ల అదే రోజు ఉదయం 6 గంటలకు బెనిఫిట్ షోలు మెదలు పెడతారు. ఈ ఏరియాల్లో బారకృష్ణకు పట్టు కొంచెం తక్కువే అని చెప్పుకోవాలి.


చిత్రం విశేషాలకు వస్తే...ఈ సినిమాకు నిన్న నిర్వహించాల్సిన ప్లాటినమ్ డిస్క్ వేడుకను చివరి నిమిషంలో వాయిదా వేసారు. వాయిదాకు కారణం ఎమిటనేది తెలియలేదు. ఈ కార్యక్రమం యధాతదంగా హైదరాబాద్ లోని శిల్పా కళావేదిక పైనే ఈనెల 9న జరగనుందని సమాచారం. దీనిని ఎంతో గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాకు నిర్మాణానంతర పనులు సైతం పూర్తయ్యాయి.


దర్శకుడు మాట్లాడుతూ...‘‘ఇటీవల విడుదల చేసిన పాటలకు, ప్రచార చిత్రానికీ మంచి స్పందన వస్తోంది. తమన్‌ మంచి బాణీలు అందించారు. బాలకృష్ణను అభిమానులు ఎలా చూడాలనుకొంటున్నారో.. అంతకు మించి ఆయన పాత్రని తీర్చిదిద్దాం. ఈ నెల 14న ‘డిక్టేటర్‌' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది'' అని తెలిపారు.


About Balakrishna's 'Dictator' special shows

బాలకృష్ణ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం డిక్టేటర్. ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అంజలి, సోనాల్ చౌహాన్, అక్ష హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జనవరి 14 న సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తూన్న, ఈ సినిమా సెన్సార్ కి ఈనెల 7 తారీకున వెళ్ళనుంది. కొద్దగా మిగిలివున్న ప్యాచ్ వర్క పూర్తిచేసుకుంటున్న ఈ సినిమా డబ్బింగ్ కూడా పూర్తపుతోంది. మరోపక్క పోస్ట్ ప్రోడక్షన్ పని కూడా వేగంగా జరుగుతోంది.


మిగతా కీలకపాత్రల్లో ...ఆనంద్ రామరాజు, సుమన్‌, పవిత్రాలోకేష్‌, నాజర్‌, వెన్నెల కిషోర్‌, పృథ్వీ, కాశీ విశ్వనాథ్‌, పోసాని కృష్ణమురళి, ప్రభాస్‌ శ్రీను, హేమ, కబీర్‌, విక్రమ్‌ జీత్‌,అజయ్‌ తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి ఫైట్స్‌: రవివర్మ, ఆర్ట్‌: బ్రహ్మకడలి, ఎడిటర్‌: గౌతంరాజు, మ్యూజిక్‌: ఎస్‌.ఎస్‌.థమన్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ: శ్యామ్‌ కె.నాయుడు, రచన: శ్రీధర్‌ సీపాన, మాటు: ఎం.రత్నం, కథ, స్క్రీన్‌ప్లే: కోనవెంకట్‌,గోపిమోహన్‌, నిర్మాత: ఈరోస్‌ ఇంరట్నేషనల్‌, కో ప్రొడ్యూసర్‌, దర్శకత్వం: శ్రీవాస్‌.

English summary
‘Dictator’ is all set for a grand release on 14th of this month as Sankranthi Special. Midnight shows are planned in all the important towns of Andhra Pradesh.
Please Wait while comments are loading...