వ్యక్తిగతంగా బాలకృష్ణలో ఉన్న లక్షణాలతో...

By Srikanya

''వ్యక్తిగతంగా బాలకృష్ణలో ఉన్న కొన్ని మంచి లక్షణాలు ఈ పాత్రలో ప్రతిబింబిస్తాయి. 'శ్రీమన్నారాయణ' బాలయ్య గొప్ప చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుంది.ఇందులో బాలకృష్ణ బాధ్యతాయుతమైన వ్యక్తిగా శక్తిమంతమైన పాత్ర పోషిస్తున్నారు. '' అని దర్శకుడు రవికుమార్ చావలి అంటున్నారు. బాలకృష్ణ సరసన పార్వతీమెల్టన్, ఇషాచావ్లా నటిస్తున్నారు. ఆర్.ఆర్.మూవీమేకర్స్ సమర్పణలో ఎల్లో ఫ్లవర్స్ పతాకంపై రమేష్ పుప్పాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అలాగే బాలకృష్ణగారితో సినిమా తీయటం చాలా ఆనందంగా ఉంది. ఆయన రియల్ లైఫ్ జరిగిన జరిగిన విషయాలను ఈ సినిమాలో వాడుతున్నాను అని దర్శకుడు రవి చావలి చెప్పారు. అలాగే ఆయన ఇమేజ్ కు స్టార్ డమ్ కు ఎక్కడా తగ్గకుండా ఈ చిత్రాన్ని చేయబోతున్నాడు. స్టైలిష్ గానూ,పవర్ ఫుల్ గానూ బాలయ్య ఈచిత్రంలో కనిపిస్తారు అన్నారు. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సమర్పణలో ఎల్లో ప్లవర్స్ 'శ్రీమన్నారాయణ'ప్రారంభం అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రారంభమై షూటింగ్ జరుపుకుంటోంది.

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ...దర్సకుడు రవి ఈ కథ చెప్పగానే ఆకట్టుకుంది. సంభాషణలుకూడా ఘటికాచలం గారు అధ్బుతంగా ఇచ్చారు. నా సినిమాలో ఏమేమి ఉంటాయో..అవన్నీ ఈ సినిమాలో ఉంటాయి అన్నారు. సంగీత దర్శకుడు చక్రి ..సింహా తర్వాత మరో సారి బాలకృష్ణ సినిమాకు పనిచేస్తున్నందుకు...తన ఆనందాన్ని వ్యక్తం చేసారు. ప్రస్తుతం బాలకృష్ణ, కథానాయికలపై హైదరాబాద్‌లో పాటను చిత్రీకరిస్తున్నామని, జూన్‌లో యూరప్‌లో మూడు పాటలు, మలేసియాలో ఓ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరిస్తామని, దీంతో షూటింగ్ పూర్తవుతుందని నిర్మాత చెప్పారు.

ఇక ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా చేసిన అధినాయకుడు చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. అలాగే మరో ప్రక్క బాలకృష్ణ ఊ కొడతారా ఉలిక్క పడతారా చిత్రంలో గెస్ట్ గా చేస్తున్నారు. మరో రెండు చిత్రాలు బాలకృష్ణ ఓకే చేసినట్లు తెలస్తోంది. బెల్లంకొండ సురేష్ నిర్మించే చిత్రం సైతం ఈ సంవత్సంరమే ప్రారంభమవుతుందని తెలుస్తోంది. వరస ప్రాజెక్టులతో బాలకృష్ణ బిజీగా ఉన్నారు. అధినాయకుడు చిత్రం బాలకృష్ణకు మంచి హిట్ ఇస్తుందని భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X