twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఆహుతి’ ప్రసాద్ కష్టనష్టాలకు ఎదురీది...

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: విలక్షణ నటుడిగా తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని స్థానం సంపాదించుకున్న ఆహుతి ప్రసాద్ మరణం తెలుగు సినీ పరిశ్రమను విషాదంలో ముంచెత్తింది. ఎవరి అండా లేకుండా సొంతగా తన దైన టాలెంటుతో పైకొచ్చిన గొప్ప నటుడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా, హాస్యనటుడిగా ఆయన తనదైన ముద్ర వేసారు. 25 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో దాదాపు 275కు పైగా చిత్రాల్లో నటించారు ఆహుతిప్రసాద్.

    సినీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్న ఆయన నటనకు మాత్రం ఎప్పుడూ దూరం కాలేదు. సౌమ్యుడిగా, వివాదరహితుడిగా ఆయన చిత్ర పరిశ్రమలో మంచి పేరును సంపాదించుకున్నారు. ఆహుతి ప్రసాద్ అసలు పేరు అడుసుమిల్లి జనార్ధన వరప్రసాద్. కృష్ణా జిల్లా ముదినేపల్లి సమీపంలోని కోడూరులో జన్మించారు.

    ఆహుతి ప్రసాద్‌కు బాల్యం నుంచి సినిమాలన్న, నాటకాలన్న ఆసక్తి ఎక్కువగా ఉండేది. ఎన్టీఆర్‌కు వీరాభిమాని. నాగార్జునసాగర్‌లో తొమ్మిదవ తరగతి చదువుతున్న రోజుల్లో అన్నాచెల్లెళ్లు నాటకంతో తొలిసారి స్టేజ్‌పై అడుగుపెట్టిన ఆహుతి ప్రసాద్ ఆ ప్రదర్శనకుగాను ఉత్తమ నటుడిగా అవార్డును సొంతం చేసుకున్నారు. సినిమాల పిచ్చి కారణంగా చదువులో కాస్త వెనకే ఉండే వారు. దర్శకుడు విక్టరీ మధుసూదనరావు ప్రారంభించిన మధు ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో మొదటి బ్యాచ్ లో చేరారు. ఆయనతో పాటు శివాజీరాజా, అచ్యుత్, రాంజగన్‌ తదితరులు కూడా శిక్షణలో చేరారు.

    About great actor Ahuti Prasad

    నటనలో శిక్షణ పూర్తిచేసుకున్న ఆహుతి ప్రసాద్ సినిమా అవకాశాల కోసం ప్రయత్నాల్ని ప్రారంభించారు. మద్రాసు వెళ్లే ధైర్యం లేక దేవదాస్ కనకాల ప్రారంభించిన శిక్షణ సంస్థలో కొన్నాళ్లపాటు పనిచేశారు. విక్టరీ మధుసూదనరావు వద్ద అసిస్టెంట్‌గా చేసే అవకాశం రావడంతో చేరిపోయారు. మధుసూదనరావు దర్శకత్వం వహించిన మల్లెమొగ్గలు చిత్రంతో సహాయ దర్శకుడిగా చిత్ర పరిశ్రమలో తొలి అడుగుపెట్టారు. ఆ తర్వాత మధుసూదనరావు దర్శకత్వం వహించిన విక్రమ్ చిత్రంతో నటుడిగా వెండితెరపై అరంగేట్రం చేశారు.

    ఆహుతి ప్రసాద్ ప్రతినాయకుడి పాత్రను పోషించిన ఆహుతి చిత్రం ఆయన నట జీవితాన్ని పూర్తిగా మలుపుతిప్పింది. ఈ చిత్రంలో హోంమంత్రి శంభుప్రసాద్ పాత్రలో ఆయన విలనీని రక్తికట్టించారు. ఈ సినిమాతో పరిశ్రమలో ఆయన పేరు ఆహుతి ప్రసాద్‌గా స్థిరపడిపోయింది.

    ఆహుతి తర్వాత ఆయన ప్రయత్నలోపంతో అవకాశాలు దక్కించుకోవడంలో విఫలం అయ్యారు. ఈక్రమంలో నిర్మాణ రంగం వైపు మళ్లారు. తెలుగులో విజయం సాధించిన పోలీస్‌భార్య చిత్రాన్ని హాస్యనటుడు రఘుబాబుతో పాటు మరికొందరు మిత్రులతో కలిసి కన్నడంలో రీమేక్ చేశారు ఆహుతిప్రసాద్. మాలాశ్రీ కథానాయికగా నటించిన ఈ చిత్రం నిర్మాతగా ఆహుతి ప్రసాద్‌కు మంచి లాభాల్ని తెచ్చిపెట్టింది. ఆ తర్వాత మరో రెండు సినిమాలు చేస్తే నష్టాలు వచ్చాయి. దీంతో సినిమా రంగాన్ని వదిలి సొంతగా వ్యాపారం చేసాడు.

    వ్యాపార కారణంగా నాలుగేళ్లపాటు సినిమాలకు దూరమైన ఆహుతిప్రసాద్ నిన్నే పెళ్లాడతా చిత్రంతో తిరిగి సెకండ్‌ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కథానాయిక టబు తండ్రిగా ఆయన పోషించిన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. నంది అవార్డు కూడా వచ్చింది. అప్పటి నుండి అవకాశాలు పెరిగాయి. తర్వాత కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామ సినిమా కూడా ఆయనకు నంది అవార్డు తెచ్చి పెట్టింది.

    నేను నిన్ను ప్రేమిస్తున్నాను చిత్రంలో నటనకుగాను విమర్శకుల ప్రశంసలతో పాటు ఉత్తమ ప్రతినాయకుడిగా నంది అవార్డును అందుకున్నారు. ఆహుతి ప్రసాద్‌కు నిన్నే పెళ్లాడతా చిత్రంతో కొత్త జీవితాన్ని ఇచ్చిన దర్శకుడు కృష్ణవంశీ ఆ తర్వాత చందమామ చిత్రంతో మరో హిట్‌ను అందించారాయనకు.

    English summary
    Popular Telugu actor Ahuti Prasad died of cancer at a private hospital in Hyderabad on Sunday, 4 January. His sudden death has shocked many in Andhra Pradesh and Telangana.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X