twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఐడియా బావుంది..వర్కవుట్ అవుద్దా

    By Srikanya
    |

    హైదరాబాద్ : ''మనకు సాధారణంగా సినిమా అంటే రెండు గంటలు. మహా అయితే రెండున్నర గంటలు అలవాటు. ఇప్పుడు నేను ఆ సమయంలోనే రెండు సినిమాలు చూపించబోతున్నాను. 80 నిమిషాల నిడివితో రెండు వేర్వేరు సినిమాలు తెరకెక్కించి ఆ రెండింటిని జోడించి ఒకే టికెట్‌పై రెండు సినిమాలు చూపిస్తాం. వీటికి'ముసలోడు', 'ది లేటెస్ట్‌' అని పేర్లు పెడుతున్నాను అంటున్నారు లారెన్స్. ఈ ఐడియా విన్న ఇండస్ట్రీ జనం..గతంలో తెలుగులో చేసారని, అయితే అప్పట్లో వర్కవుట్ కాలేదని, ఇప్పుడు కాలం మారింది కాబట్టి కమర్షియల్ గా వర్కవుట్ అయ్యే అవకాసం ఉందని అంటున్నారు.

    సినిమాకెళ్లినప్పుడు విశ్రాంతి సమయంలో 'శుభం' కార్డు పడి, టీ తాగొచ్చాక వేరే సినిమా ఓపెనింగ్‌ టైటిల్స్‌ పడితే- కొత్తగా ఉంది కదా ఈ ఆలోచన. ఇలాంటి ఆలోచనే చేశారు లారెన్స్‌. ఆయన తాజా చిత్రం 'ముని 3: గంగ' తర్వాత ఓ కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ఈ విషయాన్ని ఆయన గురువారం హైదరాబాద్‌లో తెలిపారు.

    About Lawrence's crazy project

    లారెన్స్ కంటిన్యూ చేస్తూ... ఈ రెండింటిలోనూ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నాను. రెండు పాత్రలు, కథలు, సినిమాలు ఒకదానికొకటి అస్సలు సంబంధం ఉండవు. 'ముసలోడు'లో ఆండ్రియా, 'ది లేటెస్ట్‌'లో లక్ష్మీరాయ్‌ హీరోయిన్ గా చేస్తారు. పూర్వ నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబరులో చిత్రాన్ని పట్టాలెక్కిస్తాను. 'ముసలోడు'లో వినోదం, సందేశం, యాక్షన్‌ అంశాలుంటాయి. 'దిలేటెస్ట్‌' పూర్తి వినోదాత్మక వాణిజ్య చిత్రంగా ఉంటుంది''అన్నారు. లక్ష్మీరాయ్‌ మాట్లాడుతూ ''నా సినీ జీవితంలో సరికొత్త పాత్ర పోషిస్తున్నాను. నా పాత్ర చిత్రణ, శైలి కొత్తగా ఉంటాయి'' అని చెప్పింది.

    'గంగ' గురించి చెప్తూ... 'ముని' పరంపరలో భాగంగా తెరకెక్కుతున్న మూడో చిత్రం 'ముని 3: గంగ'. లారెన్స్‌ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. తాప్సి, నిత్యమీనన్‌ ముఖ్యపాత్రధారులు. బెల్లంకొండ సురేష్‌ నిర్మాత. ఈ సినిమా చిత్రీకరణ చివరిదశకొచ్చింది. ''కాంచన' విజయవంతమైన సమయంలో 'గంగ' ప్రారంభించాను. మధ్యలో అనారోగ్యం పాలవడం వల్ల ఐదు నెలలపాటు చిత్రీకరణకు విరామమిచ్చాను. ఇటీవల మళ్లీ చిత్రీకరణ ప్రారంభించాం. త్వరలో పతాక సన్నివేశాలను చిత్రీకరిస్తామ''న్నారు లారెన్స్‌.

    English summary
    Lawrence will make two movies in one film. Yes ! You heard that right. For those who come into the theaters buying one ticket, they will get to see two different films in each half.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X