»   » మహేష్‌ ‘ఎనిమి’ కాదంటున్న మురుగుదాస్

మహేష్‌ ‘ఎనిమి’ కాదంటున్న మురుగుదాస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్‌బాబు, మురుగదాస్‌ కలయికలో రూపొందనున్న చిత్రానికి పనులు వేగవంతంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. న్యాయ వ్యవస్థ చుట్టూ నడిచే ఈ కథ కోసం ‘చట్టంతో పోరాటం', ‘ఎనిమి ' టైటిల్స్ పెడుతున్నారని ప్రచారంలోకి వచ్చాయి. అయితే మురగదాస్ వాటిని ఖండించారు.

రీసెంట్ గా ఈ విషయమై మురుగదాస్‌ మాట్లడుతూ....ఇప్పటివరకు ఈ సినిమాకి ఎలాంటి పేరూ పెట్టాలా అని నిర్ణయించుకోలేదని వివరణ ఇచ్చారు. అసలు ఈ ‘ఎనిమి' అనే టైటిల్‌ విషయంలో గాని, ‘మహేష్‌ డ్యూయల్‌ రోల్‌ చేస్తున్నారన్న విషయంలో గాని నిజం లేదని తేల్చి చెప్పినట్టు సమాచారం. కాకపోతే హీరోయిన్ కోసం మాత్రం ఇంకా వేట జరుపుతున్నారని సమాచారం.

About Mahesh, murugudas movie titile

ఓ బాలీవుడ్‌ సుందరిని ఎంపిక చేసే ప్రయత్నాల్లో సినిమా యునిట్ ఉందని సమాచారం. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపోందే ఈ సినిమా ఏప్రిల్‌ నుంచి సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయి.

ప్రస్తుతం మహేష బ్రహ్మోత్సవంలోను, మురుగుదాస్ 24 సినిమాల్లోనూ బిజిగా వున్నారు. వీటి తర్వాత ఈ సినిమా మెదలౌతుందని సమాచారం. ఈ రెండు సినిమాలు ఇంచుమించు ముగింపు దశలో వున్నాయి.

English summary
Director AR Murugadoss says his film with Mahesh Babu is not titled as Enemy.
Please Wait while comments are loading...