»   » 'రోబో' లో రజనీ, ఐశ్వర్య రాయ్ క్యారెక్టర్స్ ఏంటి

'రోబో' లో రజనీ, ఐశ్వర్య రాయ్ క్యారెక్టర్స్ ఏంటి

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ రోజు రిలీజ్ అవుతున్న "రోబో" చిత్రంలో రజనీకాంత్..డాక్టర్ వశీ అనే పాత్రను పోషించారు. ఆయనో ఓ సైంటిస్టు. ఆయన సమాజానికి ఉపయోగపడాలని తన సామర్ధాన్ని అంతా ఉపయోగించి ఓ ఆండ్రో-హ్యూమనాయిడ్ రోబోని తయారు చేస్తాడు. ఆయన తయారు చేసిన రోబో పాత్ర పేరు..చిట్టి...అది తన సృష్టికర్త డాక్టర్ వశీ(రజనీకాంత్) రూపంలోనే ఉంటుంది. ఆ రోబో పాత్రనూ రజనీకాంతే పోషించారు. చూడ్డానికి మనిషిలాగ ఉండే ఈ రోబోకి హ్యూమన్ ఎమోషన్స్ తో అపగ్రేడ్ చేస్తారు. దాంతో ఎమోషన్స్ లో, ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఇక హీరోయిన్ ఐశ్వర్య రాయ్ పాత్ర పేరు సనా. ఆమె ఓ సైన్స్ స్టూడెంట్. డాక్టర్ వంశీతో ప్రేమలో పడుతుంది. ఆమె ఓ ఓల్డేడ్ హోమ్ లో వాలంటీర్ గా పనిచేస్తూంటుంది. ఈ మెయిన్ క్యారెక్టర్స్ తో కథనం నడుస్తుంది. మన రాష్ట్రంలో దాదాపు 525 థియేటర్లలో 'రోబో' విడుదలవుతుంది. నైజామ్‌ ప్రాంతంలో 175 థియేటర్లలో ఈ చిత్రాన్ని ప్రదర్శించేందుకు సిద్ధం చేశారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu