»   » నాన్నగారితో నా కాంబినేషన్ ఎప్పుడంటే....నాగచైతన్య

నాన్నగారితో నా కాంబినేషన్ ఎప్పుడంటే....నాగచైతన్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాన్నగారితో కలిసి సినిమా చేయాలని ఉంది. ఆయన కూడా నాతో కలిసి సినిమా చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇద్దరం కలిసి సినిమా తప్పకుండా చేస్తాం అంటున్నాడు నాగచైతన్య. అయితే ఇద్దరికీ సరిపోయే...మంచి కథ దొరికాలి అంటున్నాడు. నాగచైతన్య నటించిన రెండో చిత్రం 'ఏ మాయ చేసావె' ప్రమోషన్ లో భాగంగా మీడియాని కలిసి మాట్లాడారు.ఆ మాటల్లో...'ఏ మాయ చేసావె'ని నాన్న నటించిన 'గీతాంజలి'తో పోలుస్తున్నారు. యాక్చువల్‌ గా గీతాంజలి సినిమాని వేరే ఏ సినిమాతోనూ పోల్చకూడదు. అదొక క్లాసిక్‌. అప్పట్లో గీతాంజలికి నాన్న ఎన్ని కాంప్లిమెంట్స్‌ అందుకున్నారో ఇప్పుడు 'ఏ మాయ చేసావె'కి నేను కూడా అన్ని కాంప్లిమెంట్స్‌ అందుకుంటున్నాను. నాన్నకి మంచి అనుభవం ఉంది కాబట్టి నేను ఆయన సలహాలు తీసుకుంటాను. అలాగే కథలు ఎంపిక చేసేంత అనుభవం నాకు లేదు కాబట్టి నాన్నని కథ వినమంటాను. తుది నిర్ణయం మాత్రం ఆయన నన్నే తీసుకోమంటారు. అంతే తప్ప నా సినిమాల షూటింగ్స్‌కి కూడా మావాళ్లు రారు. నీకే సపోర్ట్‌ కావాలన్నా మేం ఉన్నాం అని మాత్రం అంటారు. నేను అడిగితే సలహాలిస్తారు.

ఇక నాకు హారర్‌ సినిమాలు తప్ప నాకు అన్ని రకాల సినిమాలు ఇష్టం. నాది కేవలం రెండు సినిమాల అనుభవం మాత్రమే. ఇప్పుడే 'ఫార్ములా' సినిమాలకు అలవాటు పడిపోతే అందులోంచి బయటకు రాలేను. అందుకే వెరైటీ సినిమాలు చేస్తూ కొంచెం ప్రయోగాత్మకంగా వెళ్లాలనుకుంటున్నాను. ఆ తర్వాత కమర్షియల్‌ సినిమాలకు పరిమితమైనా పెద్దగా ఇబ్బంది ఉండదు. ఫస్ట్‌ 'జోష్‌', ఇప్పుడు 'ఏ మాయ చెసావె', మూడోది పక్కా యాక్షన్‌ ఫిల్మ్‌ చేయాలనుకుంటున్నాను. ఇంకా కొంత అనుభవం సంపాదించిన తర్వాత నాన్న చేసినట్లుగా 'అన్నమయ్య', 'శ్రీరామదాసు'లాంటి చిత్రాలు కూడా చేయాలని ఉంది. అలాంటి సినిమాలు చేసినప్పుడే నిజమైన నటుడు బయటికొస్తాడు అంటున్నాడు. బెస్టాఫ్ లక్ నాగ చైతన్య.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu