»   » నాగార్జున సెల్ ఫోన్ కాలర్ ట్యూన్ అదే

నాగార్జున సెల్ ఫోన్ కాలర్ ట్యూన్ అదే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరో నాగార్జున సెల్ ఫోన్ కాలర్ ట్యూన్ ఏదై ఉంటుంది అనే సరదా సందేహం అభిమానులకే కాక అందరికీ వస్తుంది. దానికి సమాధానంగా ఆయన మాట్లాడుతూ... "నేను ఇప్పటి వరకూ కాలర్‌ ట్యూన్‌ పెట్టుకోలేదు. తొలిసారి ఓ పాట నా మనసుకి నచ్చింది...అది మా అబ్బాయి నాగచైతన్య కొత్త చిత్రం 'ఏ మాయ చేసావె' లోది. 'ఈ హృదయం...' అనే పాట బాగా నచ్చింది. ఆ సినిమాలోని పాటలు వింటుంటే నాకు 'గీతాంజలి'కి పని చేసిన సమయం గుర్తుకొచ్చింది. రెహమాన్‌ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేద"న్నారు. ఇక నాగచైతన్య రెండో చిత్రమైన ఈ చిత్రంలో హీరోయిన్ గా సమంత పరిచయమవుతోంది.వెంకటేష్ తో ఘర్షణ చిత్రం రూపొందించిన దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సంజయ్‌ స్వరూప్‌ నిర్మాత. ఎఆర్ రెహమాన్‌ స్వరాలు సమకూర్చారు. మొన్నే సైలెంట్ గా ఈ చిత్రం ఆడియో విడుదల చేసారు. ఇక ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ "ప్రస్తుతం ప్యాచ్‌ వర్క్‌ చేస్తున్నాం. రెండు మూడు రోజుల్లో షూటింగ్‌ మొత్తం పూర్తవుతుంది. మరో వైపు డబ్బింగ్‌ పనులు జరుగుతున్నాయి. పాటలకి స్పందన బాగుంద"ని ప్పారు. ఇక ఈ చిత్రం అనంతరం నాగచైతన్య అజయ్ భువన్ అనే నూతన దర్శకుడు దర్శకత్వంలో చిత్రం చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu