»   » కర్ణాటక లో పవన్‌కల్యాణ్‌ కొత్తగా ఏం చెప్పారు?(వీడియో)

కర్ణాటక లో పవన్‌కల్యాణ్‌ కొత్తగా ఏం చెప్పారు?(వీడియో)

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  కొలరా :రాజకీయాల్లో సమూల మార్పు.. సమాజహితం.. ప్రజాసమస్యలు పరిష్కారమే లక్ష్యంగా జనసేనను స్థాపించిన ప్రముఖ సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ ప్రజాప్రస్థానానికి కర్ణాటక నుంచే అడుగులు పడ్డాయి. జనసేన పార్టీని ప్రకటించిన తరువాత ఆయన రాజకీయ బహిరంగ సభలో పాల్గొంది కర్ణాటకలోనే. మంగళవారం పవన్‌ బంగారుసీమ కోలారులో భారతీయ జనతా పార్టీకి మద్దతుగా తొలి బహిరంగసభలో పాల్గొన్నారు. రెండవ సభను రాయచూరులో నిర్వహించారు.

  About Pawan Kalyan Karnataka Speech

  రెండు చోట్లా సభ విజయవంతమైనట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మొదటి సభలోనే ఆయన ప్రసంగం అభిమానులను ఆకట్టుకుంది. ఒకవైపు దేశ సమస్యల్ని ప్రస్తావిస్తూనే మరోవైపు స్థానిక సమస్యలు, వాటి పరిష్కారానికి ఏం చేయాలి? ఎలా చేయాలి? అన్న ఆరాటాన్ని వ్యక్తం చేయడం ఆయన మద్దతుదారుల్లో నూతనోత్సాహాన్ని కల్గించింది.తాను మద్దతిస్తున్న అభ్యర్థులు ఎంపీగా ఎన్నికయితే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మరోసారి ప్రచారానికి వచ్చేలా చూడాలని వారి బాధ్యతను గుర్తు చేశారు. అభివృద్ధి, సంక్షేమంపై దూరదృష్టితో పవన్‌ ప్రసంగించారని సర్వత్రా వ్యక్తమవుతోంది. కోలారు జిల్లాలోని ముళబాగిలు, బంగారుపేట, మాలూరు ప్రాంతాల్లో రోడ్‌షోలకు ఏర్పాట్లు చేసుకున్నా అనుమతి లభించకపోవడం కొంత నిరాశను కల్గించింది.

  'ఎల్లరిగూ నమస్కార. ననగె స్వల్పస్వల్ప కన్నడ బరుత్తదె. దయవిట్టు క్షమిసి...' అంటూ పవర్‌స్టార్‌, జనసేన వ్యవస్థాపకులు పవన్‌కల్యాణ్‌ కన్నడలో ప్రసంగాన్ని ప్రారంభించి అభిమానులు, కార్యకర్తల్ని హుషారెత్తించారు. మనస్ఫూర్తిగా కన్నడలోనే మాట్లాడాలని ఉంది. అయినా సాధ్యం కాలేదు. భాష కన్నా భావం ముఖ్యమని నమ్మేవాడిని. ఎన్నికలనగానే అనేకమంది నాయకుల ప్రచారానికి వస్తారు. హామీల్ని గుప్పిస్తుంటారు. నేను మాత్రం అలా రాలేదు. మీ సమస్యలు పరిష్కారం కావాలంటే సుస్థిర, సమర్థ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి.. అది మనవి చేసేందుకే వచ్చాను. ప్రజాసమస్యలు పరిష్కారం కావాలి. అందరికీ న్యాయం జరగాలి. అందుకే జనసేన స్థాపించాను. సమర్థ నాయకత్వ అవసరం గురించి ప్రజలకు వివరిస్తున్నాను అన్నారు పవన్‌.

  'సమస్యలు తలెత్తినప్పుడు, సంక్షోభం ఎదురైనప్పుడు భయపడేవాడు నాయకుడు అనిపించుకోడు. కష్టమైనా నష్టమైనా ప్రజల్ని ముందుకు తీసుకెళ్లేవాడే అసలుసిసలు నాయకుడు. నరేంద్రమోడీలో ఆ నాయకత్వ లక్షణాన్ని చూశాను. అందుకే మద్దతిస్తున్నాను. మనం ఎన్నుకునే ప్రజాప్రతినిధితో పనిచేయించగలిగే బలమైన నాయకుడు ఢిల్లీలో ఉన్నప్పుడే ఆశించిన స్థాయిలో అభివృద్ధి సాధ్యం. అప్పుడే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకూ పరిష్కారం లభిస్తుంది. మోడీకి స్వలాభాపేక్షలేదు. జీవితాన్ని ప్రజల కోసమే అంకితం చేశారు. భాజపాకు మద్దతిచ్చేముందు మోడీతో గంటసేపు చర్చించాను.

  దేశ భవిష్యత్తుపై ఎలాంటి ఆలోచనలున్నాయని అడిగాను. యువతకు ఉపాధిఅవకాశాల్ని మెరుగుపరచాలని మోడీ అభిప్రాయపడ్డారు. వ్యవసాయాధార పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యమిస్తానని అన్నారు. ముస్లింలకు ఎలాంటి అభద్రతా భావం లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. రాజకీయాల్లోకి రావాలనేది ఒకటిరెండు రోజుల్లో తీసుకున్న నిర్ణయం కాదు. ఆరు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌ పాలనను చూశాం. యువతకు ఏమి చేశారు. అలా చేయని ప్రభుత్వాన్ని ఏమి చేయాలి. విసుగొచ్చింది. విసుగు- కోపం- తిరుగుబాటు మనోభావం.. వీటి ఫలితమే జనసేన ఆవిర్భవించిందన్నారు పవన్‌.


  కన్నడ, తెలుగు భాషలు మాట్లాడుతూ ఐక్యతకు భాషాభేదం లేదని కోలారు, చిక్కబళ్లాపుర జిల్లాల ప్రజలు చాటుతున్నారు. మీనుంచి మేం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. మాట్లాడేవి రెండు భాషలైనా ఒకే రాష్ట్ర ప్రజలుగా కలసి జీవిస్తున్నారు. మీలో దేశ సమగ్రత, ఐక్యతను చూస్తున్నాను. అయితే అక్కడ మేం మాట్లాడేది ఒకే భాష.. అయినా కొట్టుకుంటున్నాం. ఇందుకు కారణం కాంగ్రెస్‌ పార్టీ. తెలంగాణ, సీమాంధ్ర ప్రజలకు మీ స్ఫూర్తిని చెబుతాను. నిజంగా ఐక్యతకు మీరే స్ఫూర్తి' అని కొనియాడారు. తమ ప్రసంగంలో జాతీయ అంశాలతో పాటు స్థానిక సమస్యల్ని ప్రస్తావించడం ద్వారా ప్రజలకు చేరువయ్యేందుకు యత్నించారు. కోలారు జిల్లా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్ని ప్రస్తావించారు.

  కాంగ్రెస్‌ కుటుంబ, మతతత్వ పార్టీ అని పవనకల్యాణ్‌ ఆరోపించారు. ఆ పార్టీకి యువత ఓట్లు కావాలే తప్ప అభివృద్ధి మాత్రం పట్టదని దుయ్యబట్టారు. దేశంపై ఉగ్రవాదులు దాడిచేసినా ఖండించలేని నాయకులు పాలకులుగా ఉండటం దురదృష్టకరమన్నారు. గత పదేళ్లుగా సాగుతున్న కుటిల రాజకీయాలను చూసి విసుగెత్తిపోయానన్నారు. ఇంత అభిమానం, ఆదరణ తొలిసారిగా చూస్తున్నానని అభిమానులను ఉద్దేశించి అన్నారు. భాషలు, ప్రాంతాలు వేరైనా మనమంతా ఒక్కటేనని గుర్తుపెట్టుకోవాలని పవన్‌ కోరారు. చివరగా కాంగ్రెస్‌ కో హఠావో.. దేశ్‌ కో బచావో అని మూడుసార్లు సభికులతో చెప్పించారు.

  <center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/d5PPCtWvm30?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

  English summary
  Pawan Kalyan arrived to a rousing welcome in Kolar of Karnataka . The actor, who recently launched the Jana Sena party to fight corruption was in Kolar to campaign for the BJP. The actor received thunderous round applause even as Pawan's supporters raised slogans. The huge crowd that had thronged the public meeting venue were uncontrollable as they howled making it impossible for Pawan's speech to be heard.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more