»   » మెమెరీ లాస్ కథ తో మరో చిత్రం

మెమెరీ లాస్ కథ తో మరో చిత్రం

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : తమిళంలో సూపర్ హిట్ అయిన 'నడువుల కొంజం పక్కత్తినె కానుం' ఇప్పుడు తెలుగులో నిర్మాణమవుతోంది. ఈ చిత్రానికి 'పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్' అనే టైటిల్ పెట్టారు. శ్రీ, సుప్రజ జంటగా నటించారు. మహ్మద్ సోహాలి అన్సారి నిర్మాత. షాజిద్ కురేషి దర్శకుడు. గుణ్వంత్ సేన్ సంగీత దర్శకుడు.

ఈ చిత్రం కథేమిటంటే... విజయ్‌కుమార్‌కు తన ప్రేయసి సంధ్యతో పెళ్లి కుదురుతుంది. ఇంతలో అతన్ని ఫ్రెండ్స్ మ్యాచ్ ఆడుదామని పిలుస్తారు. ఓ బంతిని పట్టుకునే క్రమంలో అతను వెనక్కి పడిపోతాడు. కొంత మొమరీ లాస్ అవుతుంది. ఫ్రెండ్స్ గుర్తుంటారు కానీ ప్రేయసి, పెళ్లి మాత్రం గుర్తుండదు... ఈ కథతో తెరకెక్కిన చిత్రం 'పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్'.

శ్రీ మాట్లాడుతూ "తమిళంలో 'నడువుల కొంజం పక్కత్తినె కానుం' అనే సినిమా స్ఫూర్తితో తెరకెక్కించిన చిత్రమిది. ఐదు పాటలున్నాయి. ఈ సినిమా గురించి విని, ఓ నలుగురు హీరోలు ఈ సినిమా చేస్తానని ముందుకొచ్చారు. కానీ మేం కథ మీద ఉన్న నమ్మకంతో ఎవరికీ సబ్జెక్ట్ ఇవ్వకుండా ముందుకు సాగాం'' అని తెలిపారు.

షాజిత్ మాట్లాడుతూ "మంచి సినిమా చేశాను. తమిళంలో సినిమా చాలా పెద్ద హిట్ అయింది. తెలుగుకు తగ్గట్టు చాలా మార్పులు చేశాం. టెక్నికల్‌గా, ఆర్టిస్టుల పరంగా చాలా బాగా ఉంటుంది'' అని చెప్పారు.

సకుటుంబంతో చూసే చిత్రమని హీరోయిన్ అన్నారు. రాహుల్, సతీష్, మస్తి అలీ, రఘుబాబు, చిత్రం బాషా తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: ఐ.మార్టిన్ జో, ఎడిటింగ్: మోహన్-రామారావు, కళ: భాస్కర్, నృతాలు: హరి, లిరిక్స్: నాగ్, కరుణాకర్, శ్రీకుమార్.

English summary
"Pustakamlo Konni Pageelu Missing", This is the official Telugu remake of naduvula konjam pakkatha kaanom, Directed by Sajidh Khureshi and Produced by Sohail Ansari, Music of this movie was composed by Gunwanth.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu