‘బాహుబలి’ సౌండ్ మిక్సింగ్ గురించి ట్వీట్
హైదరాబాద్ : రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం ‘బాహుబలి'. ఈ చిత్రం విడుదల ఈ నెల 10న సిద్దమవుతోంది. ఈ నేపధ్యంలో చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి అయ్యాయి. ఈ విషయం గురించి సంగీత దర్శకుడు కళ్యాణ్ కోడూరి ట్వీట్ చేసారు. ఆయనేం ట్వీట్ చేసారో మీరే చూడండి.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఈ ఉదయం బాహుబలి సౌండ్ మిక్సింగ్‌కు సంబంధించిన కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. ఈ సినిమాలో కీరవాణి మ్యూజిక్ హైలైట్‌గా అవనుంది. ఈ రోజుతో కీరవాణి తన పాత్రను పూర్తి చేశారు. మరో ప్రక్క హైద్రాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ ఆధ్వర్యంలో డీఐ పనులు జరుగుతున్నాయి.
ఈ సినిమా దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి బాహుబలి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి మహాభారతమే తనకు స్పూర్తినిచ్చిందని తెలిపాడు. ఇదేకాదు దాదాపు తన సినిమాలన్నిటికీ రామాయణ, మహాభారతాలే స్పూర్తని చెప్పుకొచ్చాడు.

ఈ రెండు ఇతిహాసాలతో తనకున్న అనుబంధమే దీనికి కారణమని తెలియజేసాడు. బాహుబలి పార్ట్ 1 జులై 10న మనముందుకు రానుంది. బాలీవుడ్ లో కరణ్ జోహార్ సమర్పిస్తున్న ఈ సినిమాను ఆర్కా మీడియా వర్క్స్ సంస్థ నిర్మిస్తుంది.
భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న చిత్రం 'బాహుబలి'. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగం 'బాహుబలి - ది బిగినింగ్' పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ చిత్రంలో ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా ఇతర ముఖ్య పాత్రధారులు. ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మాతలు. కె.రాఘవేంద్రరావు సమర్పకుడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు అంతర్జాలంలో మంచి స్పందన వస్తోంది. కీరవాణి సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











