twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వెంకీ 'షాడో' కాన్సెప్టు ఏంటి?

    By Srikanya
    |

    హైదరాబాద్: వెంకటేష్, తాప్సీ కాంబినేషన్ లో మెహర్ రమేష్ రూపొందిస్తున్న చిత్రం 'షాడో'. ఈ చిత్రంలో వెంకటేష్ పాత్ర షాడో అంటే నీడ లాగా ఉంటుందని చిత్రం కాన్సెప్టుని చెప్తున్నారు దర్శకుడు మెహర్ రమేష్. ఆయన మాటల్లోనే... మన నీడ మనకు కనిపిస్తూనే ఉంటుంది. కానీ దాన్ని పట్టుకోవడం మన వల్ల కాదు. వెంబడించే కొద్దీ పారిపోతూనే ఉంటుంది. అతనూ నీడలాంటి వాడే! కనిపిస్తూనే వూరిస్తాడు. కానీ ఎవరికీ దొరకడు. అతనికి దొరికితే ఎవర్నీ వదలడు. అతని కథేమిటో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు .

    అలాగే ''వెంకటేష్‌ని ఎప్పుడూ చూడని పాత్రలో చూపిస్తున్నాం. ఆయన పాత్రే కాదు, సినిమా మొత్తం స్త్టెలిష్‌గా తీర్చిదిద్దాం. శ్రీకాంత్‌, తాప్సి పాత్రలూ గుర్తుండిపోతాయి. చూడ్డానికి మాస్‌, యాక్షన్‌ సినిమాలా కనిపిస్తున్నా కుటుంబ బంధాలకూ చోటిచ్చాం. ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి స్పందన వస్తోంది. అన్ని వర్గాల వారినీ దృష్టిలో పెట్టుకుని చిత్రీకరించాం. వినోదం కలగలసిన యాక్షన్ సినిమా ఇది. మలేషియాలో ఛేజ్ సీన్‌ను వెంకటేష్, శ్రీకాంత్ రిస్క్ తీసుకుని చేశారు. నాగబాబు, ఎమ్మెస్ నారాయణ పాత్రలు మెప్పిస్తాయి. వెంకటేష్‌గారితో పూర్తిస్థాయి కమర్షియల్ చిత్రాన్ని చేయాలని ఎప్పట్నుంచో అనుకున్నాను. అది ఇప్పటికి నెరవేరింది''అని మెహర్ రమేష్ చెప్పారు.

    వెంకటేష్ మాట్లాడుతూ"మంచి టీమ్‌తో చేస్తున్న సినిమా. మెహర్ మంచి ఎనర్జీతో తెరకెక్కిస్తున్నారు. మాస్‌తో పాటు ఫ్యామిలీని ఆకట్టుకునే అంశాలు చాలా ఉన్నాయి' అన్నారు. నిర్మాత మాట్లాడుతూ...సినిమా చక్కగా వచ్చింది. ఎడిటింగ్ పూర్తయింది. ప్రస్తుతం డబ్బింగ్ జరుగుతోంది. 'సింహా'ను దాటి పెద్ద చిత్రంగా నిలుస్తుంది. సింగిల్ సిట్టింగ్‌లో వెంకటేష్‌గారు కథను ఓకే చేశారు. ఆయనలోని మాస్ కోణాన్ని చూపించే సినిమా ఇది'' అని తెలిపారు. అలాగే - హై ఓల్టేజ్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇది. వినోదానికి పెద్దపీట వేసి రూపొందించామన్నారు. థమన్ చక్కని సంగీతం అందించారన్నారు. ఇటీవల రిజలైజన టీజర్‌కి ముఖ్యంగా టైటిల్ ట్రాక్‌కు అద్భుతమైన స్పందన వచ్చిందన్నారు. వెంకటేష్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తారన్నారు. ఆయన కెరీర్‌లోనే ఇది వైవిధ్యమైన చిత్రమన్నారు.

    ఉగాది సందర్భంగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. మధురిమ, ఎమ్మెస్ నారాయణ, నాగబాబు, జయప్రకాష్ రెడ్డి, ఆదిత్యమీనన్, ధర్మవరపు, ముఖేష్ రుషి, ప్రభు, శ్రీనివాసరెడ్డి తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ:కోన వెంకట్, గోపిమోహన్, మాటలు:కోన వెంకట్, మెహర్ రమేష్, పాటలు:చంద్రబోస్, రామజోగయ్య శాస్ర్తీ, కెమెరా:ప్రసాద్ మూరెళ్ల, సంగీతం: థమన్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, హ్యారీ (సిడ్నీ), ఎడిటింగ్:మార్తాండ్.కె, డాన్స్ రాజు, కథనం - దర్శకత్వం: మెహర్ రమేష్.

    English summary
    Venkatesh's forthcoming film Shadow shooting is almost completed and recently the film unit were shot climax sequence of the film.Now the latest news is that the movie release date has been confirmed,the movie audio will be released in the first week of March and the movie will hit the theaters ugadi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X