»   »  కృష్ణ వంశి షూటింగ్ లో ప్రమాదం...ఒకరు మృతి

కృష్ణ వంశి షూటింగ్ లో ప్రమాదం...ఒకరు మృతి

Posted By:
Subscribe to Filmibeat Telugu
Krishna Vamsi
రామోజీ ఫిలిం సిటీలో గత మూడు రోజులుగా కృష్ణ వంశీ దర్శకత్వంలో శశిరేఖా పరిణయం షూటింగ్ జరుగుతోంది. ఇందులో పనిచేసేందుకు ఫిలింసిటీ రిక్రూట్ మెంట్ విభాగం వాళ్లు కురుణ కుమార్ తో పాటు మరో 14 మందిని నియమించారు. రోజూ మాదిరిగానే శుక్రవారం ఉదయం 6గంటలకు సినిమా షూటింగ్ మొదలైంది. అరగంట తరువాత కురుణకుమార్ను క్రేనే పై ఉన్న కెమెరా తిప్పేందుకు పంపారు. సుమారు 40 అడుగుల ఎత్తులో ఉన్న కెమెరాను షూటింగ్ జరుగుతున్న వైపు తిప్పే ప్రయత్నంలో కరుణకుమార్ కాలుజారి క్రింద పడిపోయాడు. క్రింద పెద్ద బండ రాయి ఉండటంతో థలకు తీవ్రంగా గాయాలై అక్కడికక్కడే మరణించాడు. అల్లం కురుణ కుమార్(22) పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం కొరువరవెల్లి గ్రామానికి చెందినవాడు.జనవరి నెలనుండి ఫిల్మ్ సిటీలో పనిచేస్తున్నాడు.

ఇక ఈ సంఘటన జరిగిన అరగంటకే మరో ప్రమాదం ఫిల్మ్ సిటీలో చోటుచేసుకుంది. ఉషాకిరణ్ మూవీస్ ప్రొడక్షన్ -81
బ్యానర్ పై రవిబాబు దర్శకత్వంలోని చిత్రానికి సంభందించి శుక్రవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో స్మాల్ టౌన్ వద్ద ఉన్న ఓ భవనంపై ఓ షూటింగ్ నడుస్తోంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్టణం మండలం పోల్కంపల్లి గ్రామానికి చెందిన షేక్ షరీఫ్(25) ఈ బృందంలో లైట్ బాయ్ గా పనిచేస్తున్నాడు. షరీఫ్ చేతిలోని లైటును హీరోయిన్ వైపు తిప్పుతూ ప్రమాదవశాత్తు భవనంపై నుంచి క్రిందపడ్డాడు. రెయిలింగ్ లేకపోవడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని ప్రత్యక్ష్య సాక్షులు చెప్తున్నారు. ప్రాణాపాయం లో ఉన్న అతన్ని ఆసుపత్రికి తరలించగా అతని కాలు,నడుము విరిగినట్లు వైద్యులు నిర్దారించారు. ప్రమాదం జరిగే చోట రక్షణ ఏర్పాట్లు సరిగా చేయాలంటూ ఫిలింసిటీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X