»   »  ‘కిక్’ మూవీ షూటింగులో యాక్సిడెంట్

‘కిక్’ మూవీ షూటింగులో యాక్సిడెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : సల్మాన్ ఖాన్ హీరోగా బాలీవుడ్లో రూపొందుతున్న 'కిక్' మూవీ షూటింగు ఇటీవలే మొదలైంది. అయితే ఫస్ట్ షెడ్యూల్‌లో చిత్రీకరణ జరుగుతుండగా పెద్ద యాక్సిడెంట్ చోటు చేసుకుంది. స్కాట్‌లాండ్‌లోని గ్లాస్గోలో ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న రణదీప్ హుడా డేంజరస్ స్టంట్ చేస్తుండగా అతని కారు అదుపు తప్పింది.

షూటింగులో భాగంగా కార్ చేజింగ్ సీన్ చిత్రీకరిస్తున్నారు. రణదీప్ హుడా నడుపుతున్న కారు అదుపు తప్పి గ్లాస్గోలోని ఓ వీధిలో ప్రహరీ గోడను ఢీ కొట్టింది. బాలీవుడ్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం షూటింగ్ సెకండ్ రోజు యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. చిన్న పొరపాటు కారణంగా కారు అదుపు తప్పినట్లు తెలుస్తోంది.

ఈ సంఘటనతో షూటింగ్ నిలిపి వేసారు. ఈ సంఘటన జరిగినప్పుడు సల్మాన్ ఖాన్ సెట్స్‌లో లేడని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియావాలా నిర్మిస్తున్నారు. సల్మాన్ తో కలిసి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఐటం సాంగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఆగస్టులో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

English summary
The shooting of Salman Khan's Kick has just began but in its very first schedule a major accident happened on the sets. Randeep Hooda, who is also playing an important role in the movie, was shooting a dangerous stunt scene, when his car went out of control in Glasgow, Scotland.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu