»   » హీరోలని తలదన్నే సంపాదన: ఫోర్బ్స్ ప్రకారం ఈమె ఆదాయమెంతో తెలుసా?

హీరోలని తలదన్నే సంపాదన: ఫోర్బ్స్ ప్రకారం ఈమె ఆదాయమెంతో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రియాంకా చోప్రా బాలీవుడ్ లో నాలుగు సంవత్సరాల క్రితం వరకూ ఒక సాధారణ హీరోయిన్. ఇండియన్ సినిమాలో "హీరో కోసం" తప్పని సరైపెట్టే ఒక పాత్ర లాంటి హీరోయిన్ల జాబితాలో ఉండేది. ఒకానొక దశలో ఇక బాలీవుడ్ యువహీరోయిన్ల వరదలో కొట్టుకుపోతుంది అన్న దశకి వచ్చేసింది. కానీ అక్కడే సీన్ రివర్స్ అయ్యింది సో కాల్డ్ "హీరోయిన్" గా మిగిలిపోకుండా తనలో ఉన్న నటనని ఇంకాస్త ముందుకు తెచ్చింది అంతే ఒక పెను మార్పు. ఆమె కెరీర్ డల్లవుతుందనుకుంటున్న తరుణంలోనే హాలీవుడ్లో ఆమె అవకాశాలు అందుకుని సూపర్ పాపులరైంది.

టెలివిజన్ షో ‘క్వాంటికో’

టెలివిజన్ షో ‘క్వాంటికో’

హాలీవుడ్ లో టెలివిజన్ షో ‘క్వాంటికో' ఆమెకు అక్కడ ఎనలేని పేరు తెచ్చిపెట్టింది. తొలి సీజన్లోనే మంచి పేరు సంపాదించిన ప్రియాంక.. రెండు, మూడు సీజన్లలోనూ అదరగొట్టేస్తోంది. ఆమెకు ఈ టీవీ సిరీస్‌లో నటించినందుకు అమెరికా పీపుల్స్ ఛాయిస్ అవార్డు కూడా దక్కింది.

మూడు మిలియన్ డాలర్ల చొప్పున

మూడు మిలియన్ డాలర్ల చొప్పున

‘క్వాంటికో'లో సీజన్‌కు మూడు మిలియన్ డాలర్ల చొప్పున ఆమె పారితోషకం పుచ్చుకున్నట్లు సమాచారం. గత ఏడాది జూన్ 1 నుంచి ఈ ఏడాది మే 31 లోపు ఏడాది కాలానికి ప్రియాంక 10.5 మిలియన్ డాలర్ల దాకా ఆర్జించిందట. అంటే రూపాయల్లో చెప్పాలంటే రూ.70 కోట్లన్నమాట. ఒక బాలీవుడ్ హీరోయిన్ ఏడాదిలో ఇంత మొత్తం సంపాదించడం చిన్న విషయం కాదు.

ప్రపంచంలో అత్య‌ధిక పారితోషికం అందుకుంటున్న టీవీ న‌టీ

ప్రపంచంలో అత్య‌ధిక పారితోషికం అందుకుంటున్న టీవీ న‌టీ

అంత‌ర్జాతీయ స్టార్ ప్రియాంక చోప్రా మ‌రోసారి ప్రపంచంలో అత్య‌ధిక పారితోషికం అందుకుంటున్న టీవీ న‌టీమ‌ణుల జాబితాలో చోటు సంపాదించింది. ఫోర్బ్స్ మేగ‌జైన్ విడుద‌ల చేసిన జాబితాలో ఈ సారి కూడా ఎనిమిదో స్థానంలో నిలిచి టాప్ 10లో మ‌రోసారి నిలిచింది.

10 మిలియ‌న్ డాల‌ర్లు

10 మిలియ‌న్ డాల‌ర్లు

జూన్ 1, 2016 నుంచి జూన్ 1, 2017 మ‌ధ్య కాలంలో టీవీ కార్య‌క్ర‌మాల ద్వారా ప్రియాంక 10 మిలియ‌న్ డాల‌ర్లు సంపాదించిన‌ట్లు ఫోర్బ్స్ పేర్కొంది. ఇందులో 50 శాతానికి పైగా ఆదాయం ప్ర‌క‌ట‌న‌ల ద్వారానే పొందిన‌ట్లు తెలిపింది. `క్వాంటికో` టీవీ సిరీస్ ద్వారా హాలీవుడ్ బుల్లితెర మీద అడుగు పెట్టిన ప్రియాంక, కొద్దికాలంలోనే త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది.

సోఫియా వెర్గారా

సోఫియా వెర్గారా

ప్ర‌స్తుతం ఈ టీవీ సిరీస్‌కి సంబంధించిన మూడో సీజ‌న్ షూటింగ్‌లో ప్రియాంక పాల్గొంటుంది. ఈ జాబితాలో ఈసారి కూడా కొలంబియా న‌టి సోఫియా వెర్గారా 41.5 మిలియ‌న్ డాల‌ర్ల సంపాద‌న‌తో మొద‌టి స్థానంలో నిలిచింది. గ‌త ఆరేళ్ల నుంచి సోఫియా వెర్గారా మొద‌టి స్థానంలో ఉంది. ఈమె న‌టిస్తున్న `మోడ్ర‌న్ ఫ్యామిలీ` టీవీ సిరీస్‌కు అమెరికాలో మంచి పేరుంది.

హీరోలు సంపాదించడం మామూలే.

హీరోలు సంపాదించడం మామూలే.

హీరోలు వందల కోట్లలో సంపాదించడం మామూలే. కానీ హీరోయిన్లకు ఇక్కడ గరిష్టంగా అంటే ఒక సినిమాకు రూ.10 కోట్ల లోపే పారితోషకం ఇస్తారు. ప్రకటనలు అవీ కలుపుకున్నా మహా అయితే రూ.30 కోట్లు సంపాదిస్తే ఎక్కువ అన్నట్లుండేది పరిస్థితి. కానీ ప్రియాంక హాలీవుడ్ స్థాయికి వెళ్లిపోయి.. భారీగా ఆదాయం మూటగట్టుకుంటోంది.

కేవలం బాలీవుడ్ హీరోయిన్ కాదు

కేవలం బాలీవుడ్ హీరోయిన్ కాదు

ఆమెకు వాణిజ్య ఒప్పందాల ద్వారా కూడా భారీగానే ముడుతోంది. గత ఏడాదిలో చాలా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఆమె చేతికి వచ్చాయి. ‘క్వాంటికో' టీవీ సిరీస్‌తో వచ్చిన పేరుతో ప్రియాంక హాలీవుడ్ మూవీ ‘బేవాచ్'లోనూ నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రియాంకా కేవలం బాలీవుడ్ హీరోయిన్ కాదు ఆమె భారతీయ నటి. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ప్రపంచానికి ఇచ్చిన ఒక "హీరోయిన్"

English summary
Priyanka Chopra strong foothold in both Bollywood and Hollywood helped her earn $10 million in the period between June 2016-17. Yet she trails Deepika Padukone, who made $11 million.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu