»   » ఇలా వచ్చిందేంటి?: సర్వేలో బాహుబలి 2, రోబో 2 ల గురించి రిజల్ట్..విని అంతా షాక్

ఇలా వచ్చిందేంటి?: సర్వేలో బాహుబలి 2, రోబో 2 ల గురించి రిజల్ట్..విని అంతా షాక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పొలిటికల్ సర్వేలు లాగానే సినిమాలకు సంభందించిన సర్వేలు కూడా ఆసక్తి గొలుపుతూంటాయి. ముఖ్యంగా కొన్ని సర్వే ఫలితాలు వింటూంటే షాక్ ఇస్తాయి. ఇప్పుడు అలాంటి ఓ షాక్ ఇండస్ట్రీకి తగిలింది. ఆ సర్వేలో బాహుబలి, రోబో 2 ల గురించి వచ్చిన రిజల్ట్ లు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఒర్మాక్స్ మీడియా సంస్థ ఓ సర్వే ని నిర్వహించింది.దేశ ప్రజలు ఆసక్తిగా ఉన్న సినిమా ఏది అంటూ ఆ సంస్థ ఒక సర్వేను నిర్వహించి, ఫలితాలు వెల్లడించింది.
ఆ సర్వేలో ...ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమాలు బాహుబలి 2, రోబో 2 అనే విషయంలో కొంతవరకే నిజం అని తేల్చింది. అంతేకాకుండా ప్రస్తుతం దేశంలో సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం బాహుబలి 2 అని చెప్పింది.


ఇక ఈ సర్వేలో పలు ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. ఈ సర్వేలో పాల్గొన్న 51శాతం మంది బాహుబలి 2 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని చెప్పారు. అయితే, రోబో 2 మాత్రం టాప్ త్రీలో కూడా లేకపోవడం గమనార్హం.


According to Survey Bahubali 2 is Most awaited Movie

అంతేకాకుండా, షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్ సినిమాలు తరువాతి స్థానాల్లో ఉన్నప్పటికీ బాహుబలికి ఈ చిత్రాలకు ఆమడ దూరంలో ఉన్నాయి. బాహుబలిపై 51శాతం మంది ఆసక్తి చూపితే, షారూక్ 'రాయీస్'కు 21శాతం, అజయ్ దేవగన్ 'గోల్ మాల్ 3' మూడో స్థానంలో నిలిచింది.


కాగా, సల్మాన్ 'ట్యూబ్ ‌లైట్' 6శాతం ఓట్లతో నాలుగో స్థానంలో నిలిస్తే.. రజనీ రోబో 2.0 కేవలం 2శాతం ఓట్లతో తరువాతి స్థానంలో నిలిచింది. వచ్చే ఏడాది రానున్న రోబో 2.0 బాహుబలికి పోటీ నిలుస్తుందేమోనని ఆందోళన పడుతున్న బాహుబలి టీం ఈ సర్వేతో మాంచి హుషారుగా ఉన్నట్లు చెప్పుకుంటున్నారు సినీ జనాలు.

English summary
According to a survey Baahubali 2 beat all big movies that are going to be released in 2017. The survey says 'Baahubali 2' has emerged as the most-awaited movie by the audiences with about 50 percent people have responded that they are looking forward to this Rajamouli's epic conclusive part.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu