»   » అమెరికా యాత్రకు ఆచారి తిప్పలు.. మలేషియాలో ..

అమెరికా యాత్రకు ఆచారి తిప్పలు.. మలేషియాలో ..

Posted By:
Subscribe to Filmibeat Telugu

మంచు విష్ణు నటిస్తున్న ఆచారి అమెరికా యాత్ర షూటింగ్ జోరందుకున్నది. ఈ చిత్రానికి సంబంధించిన మూడో షెడ్యూల్ షూటింగ్ ఇటీవల మలేషియాలో ప్రారంభమైంది. ఈ చిత్రానికి నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. విష్ణు, నాగేశ్వర్‌రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలను మంచి కామెడీ ఉంటుందనే అభిప్రాయాన్ని చిత్ర యూనిట్ వ్యక్తం చేస్తున్నది. మలేషియా షెడ్యూల్ పూర్తయిన తర్వాత చిత్ర యూనిట్ అమెరికాలో చివరి, అతి సుదీర్ఘమైన షెడ్యూల్‌ను జరుపుకొంటుంది. దాంతో సినిమా షూటింగ్ పూర్తి అవుతుంది అని చిత్ర నిర్మాతలు కీర్తీ చౌదరీ, కిట్టు పేర్కొన్నారు.

అద్భుతమైన కామెడీ చిత్రం

అద్భుతమైన కామెడీ చిత్రం

ఈ సందర్భంగా కీర్తీ, కిట్టూ మాట్లాడుతూ.. ఆచారి అమెరికా యాత్ర అద్భుతమైన కామెడీ అంశాలున్న స్రిప్ట్. సినీ అభిమానుల అంచనాలను మించి ఈ చిత్ర కథ ఉంటుంది. ఈ చిత్రాన్ని సకాలంలో పూర్తి చేయడానికి హీరో విష్ణు మంచు, ప్రగ్యా జైస్వాల్, బ్రహ్మానందంతోపాటు పలువురు సీనియర్ టెక్నీషియన్లు సహకరిస్తున్నారు అని తెలిపారు.


త్వరలో అమెరికా యాత్ర

త్వరలో అమెరికా యాత్ర

త్వరలోనే మలేషియా షెడ్యూల్ పూర్తి అవుతుంది. ఆ తర్వాత అమెరికాలో జరిగే సుదీర్ఘమైన షెడ్యూల్‌తో షూటింగ్ ముగుస్తుంది. ఇప్పటికే హైదరాబాద్‌లో మరో రెండు భారీ షెడ్యూళ్లను పూర్తి చేశాం. సినిమా అద్భుతంగా వస్తున్నది అని కీర్తీ చౌదరి వెల్లడించారు.


 భారీ సంఖ్యలో నటీనటులు

భారీ సంఖ్యలో నటీనటులు

మలేషియాలో దాదాపు 25 రోజులపాటు షెడ్యూల్ జరుగుతుంది. ప్రధాన పాత్రధారులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు. దాంతో మూడో షెడ్యూల్ పూర్తి అవుతుంది. ఈ చిత్రంలో భారీ సంఖ్యలో నటీనటులు పనిచేస్తున్నారు. వారందరిని చాలా చక్కగా నాగేశ్వర్ రావు హ్యాండిల్ చేస్తున్నారు అని నిర్మాత కిట్టూ చెప్పారు.


నటీనటులు వీరే..

నటీనటులు వీరే..

అచారి అమెరికా యాత్ర చిత్రంలో మంచు విష్ణు, ప్రగ్యా జైస్వాల్‌తోపాటు బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, కోటా శ్రీనివాసరావు, ఎల్బీ శ్రీరాం, పోసాని కృష్ణమురళి, పృథ్వీ, ప్రవీణ్, విద్యుల్లేఖ రామన్, ప్రభాస్ శ్రీను, ప్రదీప్ రావత్, అనూప్ ఠాకూర్ సింగ్ తదితరులు నటిస్తున్నారు. ఈచిత్రానికి కథను మల్లాది వెంకటకృష్ణమూర్తి, సంగీతాన్ని ఎస్ఎస్ థమన్ అందిస్తున్నారు.English summary
Versatile Vishnu Manchu and laughter specialist director G Nageshwar Reddy’s Achari America Yatra third schedule has began today in Malaysia. Till now, this super hit combination of Vishnu and Nageshwar Reddy finished two massive schedules in Hyderabad. As soon as this huge Malaysia schedule ends, immediately the team will fly to the United States of America for last and lengthy schedule.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu